Chanakyaniti : ఆడవాళ్ళ గురించి చాణిక్యుడు చెప్పిన 10 దారుణ నిజాలు..!
ప్రధానాంశాలు:
Chanakyaniti : ఆడవాళ్ళ గురించి చాణిక్యుడు చెప్పిన 10 దారుణ నిజాలు..!
Chanakyaniti : చాణక్యుడు స్త్రీల స్వభావం మరియు పురుషులు అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వివరించారు. లోకంలో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది, వాటన్నింటికీ పరిష్కారాలను తన నీతి శాస్త్రంలో పొందుపరిచారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఉండే సహజ లక్షణాల గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ చర్చిస్తుంటారు. పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఆకలి రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని, అలాగే సిగ్గు కూడా నాలుగు రెట్లు అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు. శారీరక బలంలో పురుషులు ముందున్నా, ధైర్యం విషయంలో మాత్రం స్త్రీలు ఆరు రెట్లు ముందుంటారని, అలాగే కోరికలు కూడా వారిలో ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఈ విషయాలన్నీ సమాజంలో స్త్రీల అంతర్గత శక్తిని మరియు వారి మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి.
Chanakyaniti : ఆడవాళ్ళ గురించి చాణిక్యుడు చెప్పిన 10 దారుణ నిజాలు..!
స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధాల గురించి కూడా కొన్ని కఠిన సత్యాలను వెల్లడించారు. ఒక పురుషుడు ఎప్పుడూ తన రహస్యాలను బయట పెట్టకూడదని, అలా చేస్తే అది తన నాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఒక పురుషుడు ఎప్పుడూ కన్యనే వివాహం చేసుకోవాలని, ఆమె చూడటానికి సామాన్యంగా ఉన్నా లేదా శారీరక లోపాలు ఉన్నా పర్వాలేదని కానీ, మంచి లక్షణాలు లేని అందగత్తెను మాత్రం చేసుకోకూడదని చెప్పారు. అలాగే తనకంటే తక్కువ స్థాయి కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. వివాహ బంధంలో స్త్రీ ప్రవర్తన చాలా కీలకమని, పవిత్రమైన మనసు కలిగిన భార్య దొరకడం అనేది దేవుడు ఇచ్చిన వరమని చాణక్యుడు భావించారు.
స్త్రీల మాయలో పడటం వల్ల పురుషుడు తన విజ్ఞతను కోల్పోయే అవకాశం ఉంటుందని, అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక పురుషుడు కేవలం తన సంపాదన మీద ఆధారపడి ఉన్నప్పుడే స్త్రీల గౌరవం పొందుతాడని, ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు పరిస్థితులు మారిపోతాయని వివరించారు. ఆడవాళ్లు ఒకరితో మాట్లాడుతూ మరొకరిని ఇష్టపడే అవకాశం ఉంటుందని, వారి మనసులోని మాటను కనిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. ముల్లోకాలను ఏలే దేవుళ్లే స్త్రీ మాయలో చిక్కుకున్నప్పుడు సామాన్య మానవుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందుకే అందానికి బానిస కాకుండా, మంచి ప్రవర్తన ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మోసం చేయడం లేదా మాట మార్చడం అనేది కొందరిలో సహజ సిద్ధంగా వచ్చే లక్షణాలని, వాటిని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పురుషులు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి.