Chanakya Niti : పిల్ల‌లు స‌క్సెస్ కావాలంటే.. పేరెంట్స్ ఇవి పాటించాలంటున్న చాణ‌క్య‌

Authored By mallesh | The Telugu News | Published on: April 18, 2022, 7:40 am

Chanakya Niti : తమ పిల్లలు యోగ్యులు కావాలని పేరెంట్స్ కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే ప‌ల్ల‌ల్లో చిన్న‌నాటి నుంచే మంచి అల‌వాట్లు, మంచి చెడులు, మ‌న సంస్కృతులు సాంప్ర‌దాయాల గురించి వివ‌రంగా చెప్పాలి. అప్పుడే వారు మంచి న‌డ‌వ‌డిక‌తో లైఫ్లో స‌క్సెస్ కాగ‌ల‌ర‌ని చాణ‌క్య త‌న నీతి లో చెప్పాడు. చాణ‌క్య‌నీతిలో మ‌నిషి జీవితంలో ఏం చేయాలి.. ఏం చేయ‌కుడ‌దో అనుభ‌వ‌పూర్వ‌కంగా వివ‌రించాడు. అందుకే ఇప్ప‌టిత‌రం కూడా చాణ‌క్య‌నీతి అనుస‌రిస్తుంటారు.సాధార‌ణంగా పిల్ల‌లు చిన్న చిన్న అబ‌ద్దాలు ఎక్కువ‌గా చెప్తుంటారు. చిన్న‌ప్పుడు అలా చెప్తే మ‌న‌కు కూడా ముచ్చ‌టేస్తుంటుంది.

కానీ అదే అల‌వాటు పెద్ద‌య్యాక కూడా ఉంటే ప్యూచ‌ర్ లో స‌క్సెస్ కాలేడు. అందుకే పేరెంట్స్ పిల్ల‌ల‌కు అబ‌ద్దాలు చెప్పే అల‌వాటును మార్పించాలి. దాని వ‌ల్ల జ‌రిగే అన‌ర్థాల‌ను వివ‌రించాలి.అయితే కొంత మంది పిల్ల‌లు మొండిగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఏది చేయ‌కూడ‌ద‌ని చెప్తే అదే ఎక్కువ‌గా చేస్తుంటారు. ఎంత చెప్పినా అస్స‌లు విన‌రు. త‌ల్లిదండ్రుల మాట‌ను కూడా ప‌ట్టించుకోరు. ఇది ఇలాగే కొన‌సాగితే మ‌ర్ఖుల్లా త‌యార‌వుతారు. అందుకే పేరెంట్స్ ఈ ప్ర‌వ‌ర్త‌న‌ను చిన్న‌ప్పుడే మార్చాలి.కాగా పిల్ల‌లు చ‌దువుకునే టైంలో చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటు ప‌డ‌తారు. దీంతో చ‌దువుపై శ్ర‌ద్ద పెట్టరు. ఇలాంటి టైంలోనే పేరెంట్స్ చొర‌వ తీసుకుని స‌రిదిద్దాలి. మంచి న‌డ‌వ‌డిక‌ను అల‌వ‌ర్చాలి.

children want success parents need to follow on Chanakya Niti

children want success parents need to follow on Chanakya Niti

మ‌హానుభావుల‌, మేధావుల క‌థ‌లు చెప్పి ఇన్సిపిరేష‌న్ ఇవ్వాలి. అప్పుడే లైఫ్ లో స‌క్సెస్ అవుతార‌ని చాణ‌క్య త‌న నీతిలో పేర్కొన్నాడు.చాణ‌క్యుడు పిల్ల‌ల‌ను ఐదేళ్ల పాటు ప్రేమ‌గా పెంచాల‌ని సూచించారు. ఎందుకంటే ఆ వ‌య‌స్సులో పిల్ల‌ల‌కు మంచి చెడుల‌ను గుర్తించే సామ‌ర్థ్యం ఉండ‌దు కాబ‌ట్టి. కాగా ఐదేళ్ల త‌ర్వాత పిల్ల‌ల‌తో కాస్తా క‌ఠ‌నంగా ఉండాల‌ని చెప్పారు. అలాగే టీనేజ్ లో పిల్ల‌ల‌తో స్నేహంగా ఉండాల‌ని అన్నారు. ఆ వ‌య‌స్సులో చెడుకు అట్రాక్ట్ అయ్యే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి పిల్ల‌ల‌తో ఫ్రెండ్లీగా ఉంటే అన్ని విష‌యాలు చెప్పుకుంటారు.

mallesh

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp