Diwali : ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఈ వస్తువులు కనిపిస్తే ఇక అంతే…? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే…!
ప్రధానాంశాలు:
Diwali : ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఈ వస్తువులు కనిపిస్తే ఇక అంతే...? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే...!
Diwali : దసరా నవరాత్రి ముగ్గిస్తాయో లేదో దీపావళి పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. అయితే దీపావళి పండుగకు ఇళ్లను శుభ్రం చేయడం వంటివి మొదలుపెడతారు. ఇంకా కొంతమంది అయితే ఇంటికి రంగులు కూడా వేస్తారు. ఇక ఇంటిని శుభ్రం చేసి అందంగా విద్యుత్ దీపాలతో అలంకరణ చేస్తారు. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 31వ తేదీన జరుపుకోనున్నారు. వాస్తు జ్యోతిష శాస్త్రాల ప్రకారం దీపావళి పండుగకు ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక ఈ వస్తువులు ఇంట్లో కనిపిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ సొంతమవుతుందట. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపుతూ భవిష్యత్తులో చాలా డబ్బుని ప్రసాదించబోతుందని అర్థం. మరి దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని శుభ్రపరిచే సమయంలో ఏ వస్తువులు కనిపిస్తే శుభప్రదమో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Diwali డబ్బులు కనిపిస్తే
కొంతమంది డబ్బులను బట్టలలో లేదా పర్సులలో పెట్టి వాటిని మర్చిపోతారు. అవి దీపావళి పండుగ క్లీనింగ్ సమయంలో కనిపిస్తే నీపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే త్వరలో మీ ఇంట్లో డబ్బు సమస్యలు తీరిపోతాయి.
Diwali శంఖం లేదా గవ్వలు
దీపావళికి ఇంటిని శుభ్రం చేసే సమయంలో శంఖం లేదా గవ్వలు కనిపించినట్లయితే అది శుభసంకేతంగా పరిగణించబడుతుంది. మీకు త్వరలోనే అపారమైన సంపద పదవి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
నెమలి ఈక : దీపావళికి ఇంటిని శుభ్రం చేసే సమయంలో నెమలి ఈక కనిపిస్తే అది ఎంతో శ్రేయస్కరం. దీనివల్ల మీ జీవితంలో అన్ని సమస్యలు తొలగి ఆర్థిక లాభాన్ని పొందబోతున్నారని అర్థం.
బియ్యం లేదా అక్షింతలు : దీపావళికి ఇంటిని శుభ్రం పరిచే సమయంలో బియ్యం లేదా అక్షింతలు కనిపించడం అనేది అదృష్టానికి చిహ్నం. ఎందుకంటే బియ్యం అనేది శుక్ర గ్రహానికి సంబంధించినది కాబట్టి ఇది సంపదకు చిహ్నం. అదేవిధంగా హిందూమతంలో అక్షింతలు లేకుండా ఏ పూజ పూర్తి కాదు.
ఎరుపు రంగు వస్త్రం : దీపావళికి ఇంటిని శుభ్రపరిచే సమయంలో ఎర్రటి గుడ్డ లేదా ఎరుపు రంగు చున్ని కనిపిస్తే మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి పూజలో ఎరుపు రంగు వస్త్రాన్ని ధరింపజేయడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు ఎంతో ప్రీతికరమైనది.