Pollution | దీపావళి టపాసులతో హైదరాబాద్‌తో ప్రమాదకరంగా గాలి నాణ్యత..
Pollution |హైదరాబాద్ నగరంలో దీపావళి సంబరాలు ఘనంగా ముగిసినా, టపాసుల పొగతో వాతావరణం దట్టమైన పొగమంచుతో కప్పుకుపోయింది. పండగ ఉత్సాహం కాస్తా కాలుష్య భయంగా మారింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) తాజాగా విడుదల చేసిన లైవ్ రిపోర్ట్ ప్రకారం, నగర గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
#image_title
కాలుష్యంతో సమస్యలు..
సాధారణంగా ‘మితమైన’ (Moderate) స్థాయిలో ఉండే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) నిన్న రాత్రి 338గా నమోదైంది. అంటే ఇది ‘అనారోగ్యకరమైన’ (Very Unhealthy) స్థాయిలోకి చేరిందని CPCB స్పష్టం చేసింది. నిపుణుల ప్రకారం, AQI 150–200 మధ్య ఉంటేనే ఆరోగ్యానికి హానికరం, కానీ 300 దాటితే అత్యంత ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు.
పండగ సందర్భంగా భారీగా బాణాసంచా పేల్చడంతో వాతావరణంలో దుమ్ము, పొగ, రసాయనాల మిశ్రమం పెరిగి, శ్వాసకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కాలుష్య గాలిలో బయట తిరగకూడదని వైద్యులు సూచిస్తున్నారు.అదేవిధంగా నగరంలోని పంజాగుట్ట, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో AQI రీడింగ్స్ 320 పైగా నమోదైనట్లు సమాచారం. అధికారులు ప్రజలను అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, మాస్క్‌లు ధరించాలని సూచించారు.