Crow Story : కాకి శకునం.. కాకి పదే పదే అరిస్తే మంచా…? చెడా…? అసలు కాకి కథ మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crow Story : కాకి శకునం.. కాకి పదే పదే అరిస్తే మంచా…? చెడా…? అసలు కాకి కథ మీకు తెలుసా..?

 Authored By tech | The Telugu News | Updated on :12 March 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Crow Story : కాకి శకునం.. కాకి పదే పదే అరిస్తే మంచా...? చెడా...?అసలు కాకి కథ మీకు తెలుసా..?

Crow Story : మనదేశంలో మిగతా పక్షులతో పోలిస్తే కాకికి విశేష ప్రాధాన్యం ఉంది. కాకిని మన పితృదేవతల ప్రతినిధిగా హిందూ ధర్మ శాస్త్రం చెప్తుంది. శ్రాద్ధ కర్మలు చేసే సమయంలో పిండాన్ని కాకి వచ్చి ఆలకిస్తేనే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని.. అది తినకపోతే వారి ఆత్మ చాలా కోపంగా ఉందని మనవాళ్లు బలంగా నమ్ముతారు. మన పూర్వీకులు కాకుల రూపంలో మన ఇంటి చుట్టూనే తిరుగుతారనే విశ్వాసం కూడా ఉంది. ఈ విషయంలోనే కాక వివిధ సందర్భాల్లో కాకి ప్రవర్తించే తీరును బట్టి శుభ శుభ శకునాలను మన పెద్దలు నిర్ణయించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి ముందు కాకి అరిచిందంటే చాలు. చుట్టాలు వస్తున్నారని భావిస్తారు. ఈ నమ్మకం వెనక ఒక కథ ఉంది. రామాయణ కాలంలో లంకలోకి హనుమంతుడి ప్రవేశించినప్పుడు హనుమాను చూసిన కాకి సీతాదేవి పక్కనే వాలి కావున అరిచి హానుమ వచ్చిన వార్తను సీతమ్మకు తెలిపిందట. అప్పటినుండి కాకి అరిస్తే చుట్టాలు వస్తున్నారని నమ్మకం ఏర్పడింది.

అలాగే మీ ఇంటి ఎదురుగా ఒక కాకి కాకుండా నాలుగైదు కాకులు వచ్చి అరుస్తుంటే ఏదో కీడు జరగబోతోంది అని అర్థం. అంటే కాకులకు ఏదైనా ప్రమాదకర జంతువు కనిపించినప్పుడు గుంపుగా చేరి అరుస్తాయి. సో దానివల్ల మనకు ఆపద ఎదురవచ్చని సంకేతం ఇస్తూ కాకులు మనల్ని అలర్ట్ చేస్తాయన్నమాట. కాకి ఎగురుతూ ఎగురుతూ వచ్చి మన తల మీద తన్నితే ఆ శుభమని ప్రాణభయం పొంచి ఉందనే విశ్వాసం ఉంది. ఈ శకునం వెనకాల కూడా ఒక సైన్స్ అలర్ట్ దాగి ఉంది.కాకులు సాధారణంగా చనిపోయిన జీవుల పైన వాలి వాటికి దగ్గరలో ఉన్న పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఇలా వాలిన క్రమంలో కాకి కాలికి అనేక ప్రమాదకర సూక్ష్మజీవులు పట్టుకుంటాయి.

అక్కడ కొంచెం తిని మిగతా ఆహారాన్ని తల ఫ్యామిలీ కోసం తీసుకెళ్లే కాకి ఆ జర్నీలో మన పైన వాలిన లేదా దాని నోట్లో ఉన్న మాంసం ముక్క చటిక్కుల జారి మన పైన పడ్డ దాంతో ఉన్న ప్రమాదకర సూక్ష్మజీవులు మనకు వ్యాపిస్తాయి. వీటివల్ల మనం అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే కాకి మీద వాలితే వెంటనే తల స్నానం చేసి ఏమీ కాకూడదని ఇష్ట దైవాన్ని ప్రార్థించమని మన పెద్దలు చెప్తారు. అలాగే మరిన్ని కాకి శకునాను చూస్తే..మనం ఎక్కడికైనా బయల్దేరేముందు కాకి మనకు కుడివైపు నుండి ఎడమవైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే ఎడమవైపు నుండి కుడి వైపుకు వెలితే ఆ శుభానికి సంకేతం. అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చి కాళ్లు కడుక్కొని కాసేపాగి బయలుదేరితే ఆ దోషం పోతుందని శకున శాస్త్రం చెప్తుంది…

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది