Kaki Pindam : కాకి పిండం తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? ఎవరికి తెలియని కాకి కథ.!!
ప్రధానాంశాలు:
Kaki Pindam : కాకి పిండం తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? ఎవరికి తెలియని కాకి కథ.!!
Kaki Pindam : మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు మరణించిన మూడవ రోజు నుండి 11వ రోజు వరకు ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం. మరణించిన వారు కాచిరూపంలో వచ్చి ఆ ఆహారాన్ని స్వీకరిస్తారని నమ్మకం. ఈ సాంప్రదాయం మన తాత ముత్తాతల కాలం నుంచి ఉంది. పెట్టిన ఆహారాన్ని కాకి తింటే వారి సంతోషంగా ఉన్నారని.. ఒకవేళ ఆ ఆహారాన్ని కాకి ముట్టకపోతే వారికి తీరని కోరికలు ఇంకా మిగిలి ఉన్నాయి అని విశ్వసిస్తూ ఉంటాం. మరి చనిపోయిన వారు నిజంగా ఖాకీ రూపంలో మన ఇంటికి వస్తారా.. పిండం కాకి ముట్టకపోతే ఏం జరుగుతుంది.. తదితర ఆసక్తికరమైన విషయాలను ఈ తెలుసుకుందాం.
పక్షి జాతిలో కాకికి ప్రత్యేక స్థానం ఉంది. కాకి అనగా బల్లులను బూజించే పక్షి అని అర్థం. రామాయణంలోని ఉత్తరకాండలో సవివరంగా చెప్పబడింది. రావణాసురుడు తన అన్న ఆయన కుబేరుని యుద్ధంలో ఓడించి అతనికి వరప్రసాదంగా లభించిన పుష్పక విమానాన్ని చేరబట్టి దానిమీద లంక నగరానికి వస్తూ ఉండగా మార్గ మధ్యలోనే మహారాజు దేవతలతో కలిసి యజ్ఞం చేస్తూ ఉండడాన్ని చూస్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన రావణుడు అక్కడికి చేరిగా అతడిని చూసిన దేవతలు ఇంద్రుడు నెమలిగాను యముడు కాకిగాను.. కుబేరుడు తొండగాను.. వరుడు హంసగారు మారిపోయి ప్రాణాలను దక్కించుకుంటారు. అక్కడి నుండి రావణుడు వెళ్లిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలు ఆయా రూపాలు తేజించి వారి వారి రూపాల్లోకి వస్తారు. ఆ సమయంలో తన ప్రాణాలను కాపాడిన కాకిని యమధర్మరాజు చూస్తూ ఓ వాయి తమ నా ప్రాణాలను రక్షించిన నీకు ఒక వరం ఇస్తున్నాను.
మిగిలిన ప్రాణులు అన్నిటికీ నా ప్రభావం చేత రోగాలు వస్తాయి. కానీ వ్యాధి అనేది నిన్ను దరిచేరదు. అలానే మరణించి నా లోకానికి వచ్చిన మానవులు లేక ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు నీకు ఆహారం ఇచ్చి తృప్తిపరిచినచో.. నీ ద్వారా ఆహారం పైనున్న వారి పితృదేవతలకు చేరి వారి ఆకలి బాధలు తీరుతాయి అని యముడు కాకికి వరమిచ్చాడు. పితృదేవతలు సంతృప్తి చెందారని భావిస్తుంటారు. అదేవిధంగా కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు చదువుతారు. మరియు నీటిలో తిరిగే జలచరాల రూపంలో ఉండే పితృదేవతలకు ఈ ఆహారం చేరాలని ఈ మంత్రం యొక్క ఉద్దేశం.ఒకవేళ కాకి కుటుంబ సభ్యులు పెట్టిన పిండాన్ని ముట్టకపోతే ఏదో అయిపోతుందని మన శాస్త్రాల్లో ఎక్కడ చెప్పబడలేదు..