
Crystal Shiva Lingam To Worship In Home
Crystal Shiva Lingam : మనం ఇంట్లో సాధారణంగా శివుడిని చిత్రపటాల రూపంలో పూజిస్తుంటాం. లింగం రూపంలో ఎక్కువగా పూజించరు. ఎందుకంటే విగ్రహం అయితే రోజు నియమ నిష్ఠలతో పూజలు చేయాలి. కనుకనే చాలామంది లింగం రూపంలో ఉన్న శివుడిని పూజిస్తారు. అయితే శివలింగాల్లో స్పటిక లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని అంటుంటారు. శివుడి స్పటిక లింగాన్ని పూజించడం వలన మనకు ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో కొన్ని కారణాల వలన ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. దీనివల్ల ఇంట్లోని వారందరికీ ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే శివుడు స్పటిక లింగాన్ని పూజించడం వలన ఇంట్లో ఎలాంటి దోషాలు, నెగటివ్ ఎనర్జీ, దిష్టి ఉండవు.
దీంతో అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శివుడిని పూజించడం వలన ఇంట్లోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే శివుడి స్పటిక లింగం సంపదకు, ఆనందానికి ప్రతిరూపం. కనుక లింగాన్ని పూజిస్తే మనకు ధనం ప్రాప్తిస్తుంది. ఇంట్లోని వారంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. అలాగే తీరని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ లింగాన్ని పూజిస్తే అనుకున్న పనులు విజయవంతం అవుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. శివుడి స్పటిక లింగాన్ని గరిక గడ్డి ఉంచిన నీటితో అభిషేకించడం వలన పోయిన డబ్బు తిరిగి వస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యు భయం ఉండదు.
Crystal Shiva Lingam To Worship In Home
ఆవుపాలతో చేస్తే అన్ని సౌఖ్యాలు కలుగుతాయి. పెరుగుతో చేస్తే బలం, కీర్తి ప్రఖ్యాతలు కలుగుతాయి. ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. చెరుకు రసంతో చేస్తే ధన వృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో చేస్తే దుఃఖం ఉండదు. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు ఆకులను ఉంచిన నీటితో అభిషేకం చేస్తే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే స్పటిక లింగాన్ని తేనెతో అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. పువ్వులను ఉంచిన నీటితో చేస్తే భూ లాభం కలుగుతుంది. కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే పసుపు నీటితో చేస్తే ఎంతో మంగళకరంగా ఉంటుంది. అనుకున్న పనులు విజయం సాధిస్తారు. ఈ విధంగా స్పటిక లింగాన్ని పూజించడం వలన శివుడి ఆశీస్సులను పొందవచ్చని మన పురాణాలు తెలుపుతున్నాయి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.