
మొదటి పూజ తులసి చెట్టుకి చేయాలా.? లేక పూజ మందిరంలో చేయాలా..?
పూజ చేస్తున్న వారికి అనేక సందేహాలు నిత్యం వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో పూజకు సంబంధించినటువంటి సందేహాల్లో ఎక్కువ మందికి వచ్చేటువంటి సందేహాలు మొదట పూజ తులసి చెట్టుకు చేయాలా.. లేకపోతే మన ఇంట్లోని పూజా మందిరంలో చెయ్యాలా.. ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. అలాగే మొదటి దీపం గడప దగ్గర వెలిగించాలా.. లేకపోతే మన పూజా మందిరంలోని దేవుని దగ్గర వెలిగించాలా.. ఈ సందేహాలకి సరైన నివృత్తి తెలియక అనేకమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ సందేహాలకు సరైన సమాధానాలతో పాటు నిత్యం ఆచరించే పూజా విధానంలో ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూజా విధానాన్ని సక్రమంగా చేయాలో అలాగే దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు తులసి పూజ చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఈ మీరందరూ వివరంగా తెలుసుకుంటారు.. ఈ కార్తీకమాసంలో దీపానికి దీపారాధనకి, దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఇది మన అందరికీ తెలిసిన విషయమే.. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో దీపోత్సవం చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపాలకి పాపాలను ప్రక్షాళన చేసేటువంటి శక్తి ఉంటుంది అని అర్థం. అంతేకాకుండా మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా దీపం చేస్తుంది. కేవలం సానుకూల శక్తిని ప్రవహింప చేసేలా చేస్తుంది. ఈ దీపారాధన చేసేటప్పుడు చాలామంది అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీపారాధన ఎందులో చెయ్యాలి. మీకు ఎంత స్థాయి స్తోమత కలిగి ఉన్నా లేకపోయినా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయటం అనేది గొప్ప విషయం అని చెప్పాలి. దీపారాధన మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే చేయాలి..అయితే దీపారాధన ఎవరు చేయాలి. సాధారణంగా పూజా విధానాలని ఇంట్లో స్త్రీలు పాటిస్తూ ఉంటారు. వాస్తవానికైతే ఇంటి యజమాని ఇంటికి పెద్దదైనటువంటి పురుషుడు పూజా విధానం నిత్యం పాటించాలని శాస్త్రం చెబుతోంది..స్త్రీలు పురుషుడు ఎవరైనా సరే దీపారాధన కానీ నిత్య పూజలు కాని చేయొచ్చు.
ఇక దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు బట్టల్లో దీపారాధన చేస్తే మేలు చేస్తుంది అంటారు. ఇక ఎలాంటి ఒత్తులు వాడాలి. జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని అనుగ్రహం కలుగుతుంది అంటారు. దుష్ట బాధల నుండి విముక్తి లభిస్తుంది అంటారు ఉపశమనం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక దీపారాధన చేసే సమయం చాలా ముఖ్యమైనది సూర్యోదయ సమయంలో మాత్రమే దీపారాధన చేయాలి. అంటే ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆ తర్వాత సూర్యాస్తమయం తరువాత అంటే సందెవేళలో చీకటి పడ్డాకే దీపాన్ని వెలిగించాలి. అప్పుడే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. ఇక మొదటి పూజ ఎక్కడ చేయాలి. తులసిని నిత్యం ఆరాధించాలి. ఇక మొదట పూజని తులసి మాత దగ్గర చేయాలా.. లేక మన పూజా మందిరంలో చేయాలనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. తులసి మాత దగ్గర దీపాన్ని పెట్టిన తర్వాత మీరు మీ పూజ గదిలో పూజ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి గుర్తుపెట్టుకోండి నిత్యం పూజని ఆరాధించే ప్రతి ఒక్కరూ మొదటగా మీరు మీ ఇంటి తులసమ్మకి పూజ చేయండి. ఆ తర్వాత మీ సింహద్వారాన్ని అలంకరించుకొని పూజ చేయండి. ఆ తర్వాత మీ ఇంట్లో మీ ఆరాధ్య దైవాన్ని ఆరాధించండి. ఈ వరుసక్రమాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఇది అనాదిగా మన శాస్త్రాల్లో పెద్దలు చెప్పినటువంటి మాట కాబట్టి తులసిమాతను ఆరాధించిన తర్వాత మన సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత మన పూజ గదిలో భగవంతుని ఆరాధించడం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి.
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
This website uses cookies.