Deepavali Special : దీపావళికి ఇంట్లోనే ఈజీగా పిండితో ప్రమిదలు ఇలా చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Deepavali Special : దీపావళికి ఇంట్లోనే ఈజీగా పిండితో ప్రమిదలు ఇలా చేయండి…!

Deepavali Special : దీపావళి స్పెషల్ గా పిండి ప్రమిదలు ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ పిండి ప్రమిదలను మనకు నచ్చిన డిజైన్ లో చేసుకోవచ్చు. ముందుగా ముప్పావు కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమపిండి తీసుకొని ఒక పెద్ద ప్లేట్ లో గోధుమపిండి, బియ్యం పిండి వేసి రెండు కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక డబ్బాలోకి ఒక వంతు భాగం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 October 2022,6:30 am

Deepavali Special : దీపావళి స్పెషల్ గా పిండి ప్రమిదలు ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ పిండి ప్రమిదలను మనకు నచ్చిన డిజైన్ లో చేసుకోవచ్చు. ముందుగా ముప్పావు కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమపిండి తీసుకొని ఒక పెద్ద ప్లేట్ లో గోధుమపిండి, బియ్యం పిండి వేసి రెండు కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక డబ్బాలోకి ఒక వంతు భాగం పిండి తీసుకోవాలి. మరొక వంతు బాగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఈ పిండి ముద్దను పక్కన పెట్టుకోవాలి.

మరొక డబ్బాలో తీసుకున్న పిండిని కూడా ఈ పెద్ద బౌల్ లో వేసుకున్న తర్వాత ఈ పిండిలో ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. తర్వాత మొత్తం ఒకసారి పిండిలో కలరు కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతి పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నువ్వుల నూనె వేసి మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దను పక్కన పెట్టుకోవాలి. వేరేక డబ్బాలో తీసుకున్న పిండిని కూడా ఇదే బౌల్లో గ్రీన్ కలర్ వేసి పిండిలో మొత్తం గ్రీన్ కలర్ కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతీ పిండి కలుపుకొని కొద్దిగా నువ్వుల నూనె వేసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలోంచి కొద్దికొద్దిగా తీసుకొని రౌండ్ షేప్ లో చేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొనికొద్దిగా మెల్లిగా నొక్కుతూ ప్రెస్ చేయాలి. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు.

Deepavali Special with easy Mix with flour at home

Deepavali Special with easy Mix with flour at home

చాలా ఈజీగా ప్రమిద రెడీ అయిపోయింది రెడీ చేసుకున్న ప్రమిదను రివర్స్లో చేసి అరచేతిలో వేస్తే వచ్చేస్తుంది. అంతే ప్రమిద రెడీ అయిపోయినట్లే. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న ఆరెంజ్ కలర్ పిండిని తీసుకొని నాలుగు భాగాలుగా చేసుకొని రౌండ్ బాల్స్ లా చేసి పెట్టుకోవాలి. అన్నింటినీ ఒక వాటర్ బాటిల్ మూత తీసుకొని పిన్ని మధ్యలో ఒత్తితే ప్రమిద రెడీ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ వేయకుండా కలిపి పెట్టుకున్న పిండిని నాలుగు భాగాలుగా చేసి పిండిని గరిటతో కావాల్సిన వెడల్పులో నొక్కాలి నొక్కిన తర్వాత చివరలో పిండిని దగ్గరగా మలిచినట్టుగా చేయాలి. అంతే చాలా ఈజీగా వెరైటీ డిజైన్ పిండి ప్రమిదలు దీపావళికి చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు అయితే ఐదు నిమిషాల్లో ఈ దీపావళి స్పెషల్గా ఇలా పిండి ప్రమిదలు చేసి పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ లో వెరైటీ డిజైన్ తో మన ఇంట్లో ఉండే వస్తువులతోటే ఇలా వెరైటీగా తయారు చేసుకోవచ్చు. మనం రెడీ చేసిన ఈ పిండి ప్రమిదలు నూనె అస్సలు పీల్చవు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది