Dhantrayodashi : సత్యనత్వానికి, సద్గుణ సంపతికి నిదర్శనంగా దీపావళి పండుగను భావిస్తారు. దీపావళి రోజున ఎవరి ఇంట్లో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉంటుందని నమ్ముతారు. అయితే ఈరోజున చీపురు కొనడం చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే చీపురు ను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అందుకే దీపావళి రోజున చాలామంది చీపురును కొంటుంటారు. చీపురుని ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకు వచ్చినట్లు అని భావిస్తారు. ఇంటికి తీసుకు వచ్చిన చీపురుని పూజ చేసి ఆ తర్వాత రోజున ఉపయోగించడం మొదలు పెడతారు.
అయితే చీపుర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ధన త్రయోదశి రోజు చీపురుని కొనడం ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద వస్తుంది. లక్ష్మీదేవి నివసించే చీపుర్లను ధన త్రయోదశి రోజు మంచి ముహూర్తాన ఆలయానికి దానంగా ఇవ్వాలి. ఇక శనివారం మాత్రం చీపుర్లను అస్సలు కొనకూడదు. బహిరంగ ప్రదేశాలలో చీపుర్లను అస్సలు ఉంచకూడదు. చీపురును ఎప్పుడు ఉత్తర దిక్కులో ఉంచాలి. దేవుడి గదిలో పడకగదిలో చీపురు అస్సలు ఉండకూడదు. చీపిరిని కాళ్లతో తాకడం, దాంతో ఎవరినైనా కొట్టడం అస్సలు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుందట. ధన త్రయోదశి రోజున బంగారం వెండి పాత్రలను కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది.
అయితే ధన త్రయోదశి రోజున మాత్రమే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ధన త్రయోదశి రోజున చీపురు కొనాలనుకుంటే పగటిపూట మాత్రం అస్సలు కొనకూడదు. సాయంత్రం మాత్రమే చీపిరిని కొనాలి. ధన త్రయోదశి రోజున ప్రదోషకాలంలో చీపురును కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున చీపిరిని పువ్వులు అక్షింతలతో ప్రార్థించాలి. ఆ తర్వాత రోజున చీపురును ఉపయోగించాలి. దీపావళి రోజున ఇల్లు మారాలి అనుకున్న వారు తప్పకుండా ఇల్లును శుభ్రం చేసి చీపురును తప్పకుండా తీసుకువెళ్లాలి. ధన త్రయోదశి రోజున ఏది కొన్న కొనకపోయినా చీపురును మాత్రం కచ్చితంగా కొనాలి. చీపురుని ఎవరైతే సరిగ్గా గౌరవిస్తారు వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.