House Shifting Tips : అద్దె ఇల్లు ఏ రోజు మారితే కలిసి వస్తుందో తెలుసా ..?
House Shifting Tips : అద్దె ఇళ్లలో ఉండేవారు కొన్ని కారణాల వలన ఇల్లు మారాల్సి వస్తుంటుంది. అయితే అద్దె ఇల్లు మారటానికి ఏరోజు మారితే మంచిదని ఆలోచిస్తుంటారు. అని మాసాలలో చూసుకున్నట్లయితే ఆషాడ మాసం, శ్రావణమాసం, భాద్ర పద మాసం, ఇలా ఏ మాసాలలో మారిన అన్ని పరిస్థితులు చూసుకొని మారాలి. అన్ని రాశుల వారు, గ్రహాల వారు, నక్షత్రాల వారందరికీ పాడ్యమి, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ తిధులు యోగ్యమైనటువంటి తిధులు. తిధులను ఐదు భాగాలు విభజించినటువంటి శాస్త్రం నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని విభజిస్తుంది.
నంద పాడ్యమి, భద్ర విదియ, జయ తదియ, రిక్త చవితి,, పూర్ణ పంచమి తిధులు శ్రేష్టమైనవి. పాడ్యమి, విదియ, తదియ, పంచమి, షష్టి, దశమి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి కొంతమేరకు ఈ తిధులు కూడా మంచివిగా స్వీకరించవచ్చు. నంద, భద్ర, జయ, పూర్ణ, రక్త తిధులలో మనం అద్దె ఇల్లును మార్చుకోవడానికి మంచి తిధులు. అలాగే బుధవారం, గురువారం, శుక్రవారం శ్రేష్టమైనటువంటి వారాలు. ఈ వారాలలో అద్దె ఇల్లు మారినట్లయితే అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
అత్యవసర పరిస్థితులలో మాత్రమే శని, ఆదివారాలను వినియోగించుకోవాలి. సోమ మంగళ వారాలలో అద్దె ఇల్లు మారకూడదు. బుధ, గురు, శుక్ర ఈ మూడు వారాలలో ఏదో ఒక రోజు ఎటువంటి మాసమైన మారితే చక్కని ఫలితం ఉంటుంది. అయితే అన్ని వారాలలో బుధవారం చాలా మంచిది. బుధవారం విష్ణు మూర్తిని కొలుస్తారు కాబట్టి అద్దె ఇంట్లో బుధవారం రోజు తొలి అడుగు వేస్తే బాగా కలిసి వస్తుంది. కనుక ఎవరైనా అద్దె ఇంట్లోకి మారేటప్పుడు బుధవారం మారితే విష్ణు నారాయణుడి అనుగ్రహంతో ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అన్ని వారాలలో బుధవారం అద్దె ఇల్లు మారడానికి శ్రేయస్కరం.
