Diwali : ప్రతి ఏడాది దీపావళికి ముందు జరుపుకునే ధన త్రయోదశి ఈసారి చాలా ప్రత్యేకమైనదిగా జ్యోతిష్య నిపుణులు పరిగణించడం జరిగింది. ఎందుకంటే ఈ ఏడాది ధన త్రయోదశి రోజు అనేక ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. త్రిగ్రాహి యోగం , త్రిపుష్కరయోగం, ఇంద్రయోగం, లక్ష్మీనారాయణ యోగం, శేష మహాపురుష రాజయోగం, దాతయోగం ,సౌమ్య యోగం వంటి ఏడు రకాల అత్యంత ప్రత్యేకమైన యోగాలు ధన త్రయోదశి రోజు ఏర్పడనున్నాయి. ఇక ఈ ఏడు రకాల సుభయోగాల కారణంగా ఈ ఏడాది జరుపుకునే ధనత్రయోదశి ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది. కావున ఈ ధన త్రయోదశి పండుగ రోజు లక్ష్మీదేవి మరియు గణేశుడు విగ్రహాలతో పాటు ధనియాలు మట్టి పాత్రలు, బంగారం, వెండి ,ఇత్తడి ,రాగి , పసుపు ,వస్త్రాలు, అలంకరణ వస్తువులు , పాత్రలు ,భూమి భవనాలు వంటివి కొనుగోలు చేయడం శుభప్రదమైనదిగా పరిగణించడం జరిగింది.
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ధన త్రయోదశి పండుగ రోజు అరుదైన యాదృచ్ఛికాలు సంభవించాయి. దాదాపు 100 సంవత్సరాల తర్వాత దాదాపు అరుదైన 7 యోగాలు ధన త్రయోదశి రోజు ఏర్పడనున్నాయి. అంతేకాక ఈ ధన త్రయోదశి రోజు శుక్రుడు బుధుడు వృశ్చిక రాశిలో కలిసి సంచారం చేయనున్నారు. కావున ఈ ధన త్రయోదశి రోజు ఇంట్లో పూజలు చేయడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ ధన త్రయోదశి రోజు పూజ చేయాలి అనుకునేవారు సాయంత్రం వేళ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా పూజ స్థలంలో కుబేరుడు మరియు లక్ష్మీదేవి చిత్రాలను లేదా విగ్రహాలను ప్రతిష్టించాలి. అనంతరం ధనవంతరి మరియు లక్ష్మీదేవి కుబేరుడు ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజించాలి. దీపం వెలిగించిన తర్వాత పండ్లు పూలు సమర్పించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజించాలి. అనంతరం నైవేద్యాలను ప్రసాదం రూపంలో కుటుంబ సభ్యులందరూ తినాలి.
ఈ విధంగా ధన త్రయోదశి రోజు కుబేరుడు మరియు లక్ష్మీదేవిని పూజించడం వలన వారికి ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది. మీ ఇల్లు సుఖసంతోషాలతో సిరిసంపదలతో వెలసిల్లుతుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ధన త్రయోదశి పండుగ రోజు బంగారం వెండి అభరణాలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదం. అదేవిధంగా ఇంట్లోకి ధనియాలు కొత్తిమీర చీపురువంటి వస్తువులు కొనడం కూడా చాలా మంచిది. దీనివలన మీ ఇంట్లో సిరిసంపదలు నిలిచి ఉంటాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.