Chanakya Niti : వీళ్ల‌తో అస్స‌లు స్నేహం చేయ‌కండి.. లేదంటే మీ జీవితంపై ప్ర‌భావం చూపుతాయంటున్న చాణ‌క్య‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chanakya Niti : వీళ్ల‌తో అస్స‌లు స్నేహం చేయ‌కండి.. లేదంటే మీ జీవితంపై ప్ర‌భావం చూపుతాయంటున్న చాణ‌క్య‌

Chanakya Niti : ఆచార్య చాణ‌క్య నీతి శాస్త్రం ఎంత ప్రాచుర్యం పొందిందో అంద‌రికీ తెలిసిందే. దౌత్యం, ఆర్థిక‌శాస్త్రం, రాజ‌కీయంగా చాణ‌క్య చెప్పిన మాట‌ల‌ను చాలా మంది ఇప్ప‌టికీ పాటిస్తారు. నేటి యువ‌త కూడా చాణ్య నీతిని ఆచ‌రిస్తున్నారు. చాణక్య తెలిపిన విధానాలు కొంతవరకూ కఠినంగా అనిపించినప్పటికీ, వీటిని జీవితంలో అమలుచేస్తే, సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు. అయితే చాణ‌క్య త‌న నీతి శాస్త్రంలో మాన‌వులు అవ‌లంభించాల్సిన ఎన్నో విష‌యాలు తెలియ‌జేశాడు. ఏవిధంగా ముందుకు వెళ్తే విజ‌యం సాధిస్తారో.. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :4 June 2022,7:40 am

Chanakya Niti : ఆచార్య చాణ‌క్య నీతి శాస్త్రం ఎంత ప్రాచుర్యం పొందిందో అంద‌రికీ తెలిసిందే. దౌత్యం, ఆర్థిక‌శాస్త్రం, రాజ‌కీయంగా చాణ‌క్య చెప్పిన మాట‌ల‌ను చాలా మంది ఇప్ప‌టికీ పాటిస్తారు. నేటి యువ‌త కూడా చాణ్య నీతిని ఆచ‌రిస్తున్నారు. చాణక్య తెలిపిన విధానాలు కొంతవరకూ కఠినంగా అనిపించినప్పటికీ, వీటిని జీవితంలో అమలుచేస్తే, సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు. అయితే చాణ‌క్య త‌న నీతి శాస్త్రంలో మాన‌వులు అవ‌లంభించాల్సిన ఎన్నో విష‌యాలు తెలియ‌జేశాడు. ఏవిధంగా ముందుకు వెళ్తే విజ‌యం సాధిస్తారో.. అలాగే మ‌నుషులు డ‌బ్బు ఉంటే ఎలా ఉంటారో.. స్వార్థం వంటి విష‌యాలు చెప్పాడు. భార్య‌భ‌ర్త‌లు ఏవిధంగా ఉండాలో.. ఎటువంటి స్త్రీల‌తో స్నేహం చేయాలో వివ‌రించాడు.

అలాగే లైఫ్లో ఎదిగే క్ర‌మంలో ఎవ‌రికి దూరంగా ఉండాలో తెలిపాడు. చెడు స‌వాసాలు చేస్తే త‌మ జీవితం నాశ‌న‌మ‌వ‌డ‌మే కాకుండా ఇత‌రుల జీవితాలు కూడా పాడ‌వుతాయిని చెప్పాడు. అందుకే అటాంటి వారితో స్నేహం చేయొద్ద‌ని తెలిపాడు. కాగా చాణ‌క్య నీతి ప్ర‌కారం ఎలాంటి వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం… చాణ‌క్య నీతి ప్ర‌కారం చెడు సావాసాలు, చెడు ప్రాంతాల్లో ఉండేవారు.. చెడుగానే ఆలోచిస్తార‌ని అలాంటి వారితో స్నేహం చేస్తే త‌మ ఆలోచ‌న‌లు కూడా చెడుగా ఉండే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పాడు. అలాంటి వారితో ఉంటే చెడు ప్ర‌భావం ఇత‌రులపై కూడా ప‌డుతుందని వివ‌రించాడు. కొంత‌మంది చెడు దృష్టితో ఉంటారు.

Do not be friends with them at all Chanakya Niti

Do not be friends with them at all Chanakya Niti

వారు ఏవిధంగా నైనా చెడు చేసే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌తిదీ వారు చెడుగానే చూస్తారు. అలాంటి వాళ్ల‌తో స్నేహం చేస్తే మ‌న‌ల్ని మ‌న చుట్టూ ఉన్న వాళ్ల‌ని కూడా చెడుగా చూస్తార‌ని అందుకే వాళ్ల‌కు దూరంగా ఉండాల‌ని సూచించాడు. అలాగే చెడు అల‌వాట్లు, సోమ‌రితనం ఉన్న వ్య‌క్తుల‌తో స్నేహం చేస్తే త‌మ గౌర‌వం కూడా కోల్పోతార‌ని అందుకే వారికి దూరంగా ఉండాల‌ని చెప్పాడు. సోమ‌రిత‌నంతో క‌ష్ట‌ప‌డ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని వ్య‌క్తులు త‌మ చుట్టు ఉన్నవారిని కూడా అలాగే త‌యారు చేస్తుంటారు. అలాగే చెడు అల‌వాట్లు ఉన్న వ్య‌క్తి కూడా ఇత‌రుల‌పై ప్ర‌భావం చూపుతాడు. అందుకే వారికి దూరంగా ఉండాల‌ని చాణక్య సూచించాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది