Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి అయిన బృహస్పతికి మరియు విష్ణుకి అంకితం చేయబడింది. అయితే బృహస్పతి లేదా గురుడు సౌర వ్యవస్థలో ప్రధాన స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా సూర్యుని తర్వాత స్థిరంగా ఉండే గురువుని విశ్వ గురువు అని కూడా పిలుస్తారు. అయితే గురువారం పూజ చేసే భక్తులకు మంచి ఆరోగ్యం ,విజయం,మరియు సంపద మంచి భాగస్వామి లభిస్తుందని నమ్మకం. హిందూ సాంప్రదాయాలలో చెట్లకు ప్రధాన స్థానం ఉంటుంది. అందులో అరటి చెట్టు ఒకటి. దీనిలో అరటి పండ్లను మరియు ఆకులను కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ అరటి చెట్టును పూజిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. మరి అది ఎలానో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
చెట్టు లేనిది మనిషికి జీవితం అనేదే లేదు. కాబట్టి చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. దేవుడికి పూలు పండ్లతో పూజిస్తే కుటుంబ క్షేమంగా ఉంటుందని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం లోక రక్షకుడు అయిన విష్ణువుకి చిహ్నంగా అరటి చెట్టుని పరిగణిస్తారు. అలాగే అరటి చెట్టు అత్యంత పవిత్రమైనదిగా కూడా భావిస్తారు. కొంతమంది గురువులకి దక్షిణగా నగదు బదులుగా అరటి చెట్టుని లేదా అరటి పండ్లను దక్షిణగా ఇవ్వవచ్చు. గృహప్రవేశాలకు వివాహాలకు మరియు ఇతర శుభకార్యాలకు అరటి చెట్లను ఇంటి ప్రవేశానికి ముందు ఇరువైపులా కడతారు. అలాగే అరటి చెట్టు లోని భాగాన్ని ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తారు. అరటి ఆకులను పవిత్రమైనదిగా భావించి అరటి ఆకులో ఆహారాన్ని అందిస్తారు. నేటి భారతదేశంలో కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.
అయితే గురువారం నాడు అరటి చెట్టును పూజించడం వలన భగవంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. అదేవిధంగా గృహంలో శుభశక్తి పెరగడంతో పాటు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇలా ప్రతివారం చేయడం వలన ఉద్యోగ జీవితంలో మరియు సామాజిక జీవితంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విష్ణువుకి ప్రతీక అయిన అరటి చెట్టుని ఇంట్లో నాటుకుంటే ఆ ఇంటి గృహస్తుడిని విష్ణు ఎప్పటికీ విడిచిపెట్టడు అని నమ్మకం. దీనివల్ల ఇంట్లోని ప్రతి సభ్యుడు జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. అలాగే వేద శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే మంగళ దోషం పోవడానికి అరటి చెట్టుని పూజించడం చాలా మంచిది. ఫలితంగా ప్రమాదాలు తగ్గుతాయి. మరియు వైరాహిక జీవితం మెరుగుపడుతుంది. అలాగే విష్ణువు ,వినాయకుడు ,లక్ష్మీదేవి పూజలలో అరటి ఆకులను సమర్పిస్తే వారు సంతోషించి తమ ఆశీర్వాదాలను అందిస్తారు.
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
This website uses cookies.