
Gods Photos : ప్రతి ఇంట్లో పూజగది తప్పనిసరిగా ఉంటుంది. పూజ చేసేటప్పుడు దేవుళ్ళ ఫోటోలు అన్నీ ఒకే దగ్గర పెట్టి పూజ చేయటం అనేది చాలా ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడే ఎక్కువ మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే దేవుళ్ళ ఫోటోలు అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టి పూజించడం కంటే కూడా ఒక్కొక్క దేవుణ్ణి వాస్తు ప్రకారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన హిందూ ధర్మ శాస్త్రాల్లో చెప్పిన విధంగా మన ఇంట్లో లేదా మన పూజ గదిలో ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క దిక్కున పెట్టినట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఏ ఫోటో ఎక్కడ పెట్టాలో తప్పక తెలుసుకోండి. మీ పూజ గదిని వాస్తు నియమాల ప్రకారం ఏర్పాటు చేసుకోండి. మీకు మేలు కలుగుతుంది.దేవుని అందరూ పూజిస్తూనే ఉంటారు. ప్రత్యేకించి దేవుని పూజించటానికి దేవుడి దగ్గర ప్రశాంతంగా కాసేపు సమయాన్ని గడపటానికి మన కోరికల్ని తీర్చమని వేడుకోవడానికి ప్రశాంతత కోసం ప్రతి ఇంట్లో కూడా చక్కగా ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.
కొంతమంది ఇళ్లలో ప్రత్యేకంగా పూజ గది ఉంటుంది. కొంతమంది వంటగదిలో భాగంగా పెడతారు. కొంతమంది హాల్లో భాగంగా పూజగదిని ఉంచుకుంటారు. అది చాలా తప్పు మన ఇంట్లో ఉన్నటువంటి పూజగది కేవలం వాస్తు నియమాల ప్రకారంగానే ఉండాలి. ఎక్కడపడితే అక్కడ పూజ గదిని ఏర్పాటు చేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు కూడా పూజగది ఈశాన్యం వైపు ఉండాలి. తూర్పు వైపు ఉండాలి. లేదా పశ్చిమ దిక్కున ఏర్పాటు చేసుకోవాలి. అసలు ఈశాన్యం వైపు మాత్రమే పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి. తెల్లవారుజామున సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కు నుంచి ఉదయిస్తూ ఉంటాడు. అలా సూర్యుడి కాంతి ఇంట్లోకి పడాలి అప్పుడే ఆ ఇంట్లో యోగం తనం ధాన్యం సుఖసంతోషాలు ఉంటాయి. సూర్యుడు లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
do you keep all the photos gods together
కాబట్టి పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం తప్పక ఈశాన్య దిక్కున ఎంచుకోండి. ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి ఇంట్లో స్థలం లేకపోతే మీ వంట గదిలో దేవుడు ఫోటోలు ఉంచుకోవచ్చు. విగ్రహాలు పెట్టి పూజ చేయాలి. అనుకుంటే మాత్రం మహా నైవేద్యాలు ప్రతినిత్యం సమర్పించాల్సి ఉంటుంది. ఇక పూజా మందిరంలో నటరాజ స్వామి విగ్రహం కూడా ఉంచకూడదు. నటరాజస్వామి విగ్రహం ఎక్కడుంటే అక్కడ నాటి నివేదన చేస్తూ ఉండాలి. కాబట్టి నటరాజస్వామి విగ్రహాన్ని కూడా మీ ఇంట్లో ఉంచుకోకపోవడం మంచిది. అలంకారప్రాయంగా మీరు ఏ రకమైన విగ్రహాన్ని అయినా ఏ రకమైనటువంటి ఆ దేవుని చిత్రపటం అయినా తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ పూజ మందిరంలో ఉపయోగించాలి. అంటే మాత్రం కొన్ని నియమాలు పాటించక తప్పదు. పూజ మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతినిత్యం దీపారాధన చేసుకోండి మీకు మేలు కలుగుతుంది.
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
This website uses cookies.