Deeparadhana : అగ్గిపుల్లతో దీపారాధన చేస్తున్నారా.. అయ్యో!
Deeparadhana : హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తుంటాం. అయితే దీపారాధన చేసేటప్పుడు ఎయే నియమ, నిబంధనలు పాటించాలో చాలా మందికి తెలియదు. అంతే కాకుండా తమకు వీలున్నట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా దీపం వెలిగిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల పూజాఫలం దక్కకపోగా నష్టం వాటిల్లుతుందని వేద పండితులు చెబుతున్నారు. అయితే దీపారాధన చేసేటప్పుడు నియమ నిష్టలతో పూజ చేయాలని సూచిస్తున్నారు. తమకు నచ్చినప్పుడు, వీలున్నప్పుడు.. అల్పాహారం తిన్న తర్వాత దీపారాధన చేయకూడదని అంటున్నారు. అయితే దీపారాధన చేసే సమయంలో ఏ విధమైనటువంటి నియమస, నిబంధనలు పాటించాలి అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది దీపం వెగించే ముందు… ముందుగా వత్తులు వేసి ఆ తర్వాత నూనె పోస్తుంటారు. అయితే అలా అస్సలే చేయకూడదని పండితులు చెబుతున్నారు. ముందుగా జీపపు కుందులలో నూనె పోసి.. ఆ తర్వాతే వత్తులు వేయాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా నేరుగా అగ్గిపుల్లలతో దీపం వెలిగించకూడదని అంటున్నారు. అలా చేయడం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే అగరు బత్తులు వెలిగించి వాటితోనే దీపారాధన చేయాలని సూచిస్తున్నారు. మనం ఏదైనా ప్రమిదను వెలిగించేటప్పుడు… ముందుగా ఆ ప్రమిదకు బొట్లు పెట్టి అలంకరించాలి. ఆ తర్వాతే దీపారాధన చేయాలి. అదే విధంగా చాలా మంది దీపం వెలిగించే టప్పుడు దీపం కింద ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా వెలగిస్తుంటారు. ఇలా ఆధారంలేని దీపాన్ని వెలిగించకూడదు.
దీపం కింద కొద్దిగా బియ్యం లేదా రావి ఆకులు, తమల పాకులు, పూల రేకులు వంటివి పెట్టి దీపారాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఉదయం దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలో వాడిన ఒత్తులను తిరిగి సాయంత్రం అస్సలే వెలిగించ కూడదు. దీపారాధన చేసే ప్రతీ సారి కొత్త వత్తులను వేయాలి. ఇలా చేయడం వల్ల పూజా ఫలం దక్కుడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే మట్టి ప్రమిదలో దీపారాధన చేయటం వల్ల కొన్ని సార్లు దీపం నల్లగా మాడిపోతుంది. ఇలా మాడిపోయిన దీపాన్ని వెంటనే తీసేయాలి. ఇలాంటి దీపాలను ఉంచడం వల్ల చెడు జరుగుతుంది. అందుకే దీపారాధాన సమయంలో కచ్చితంగా నియమ, నిబంధనలు పాటించాలి