విశ్వంలో అనేక రహస్యాలు. అనంతమైన ఈ విశ్వంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా మన సౌర మండలంలో ఏయే నక్షత్రాలు, గ్రహాలు మనపై అంటే భూమిపై, మానవుని పై ప్రభావం చూపిస్తాయో వాటి గురించి మన పెద్దల అనేక రహస్యాలను తెలియజేశారు. అదేవిధంగా ఆయా గ్రహాలు, నక్షత్రాలు అవి మన శరీరంలోని ఆయా స్థానాలపై చూపించే ప్రభావాన్ని కనుగొన్నారు. ఈరోజు మనం శరీరంలోని ఏ భాగం ఏ గ్రహానికి, ఏ రాశికి సంబంధమో తెలుసుకుందాం… మానవుని శరీరంలో కాలపురుషుని అంగములు లగ్నము నుండి మొదటి ఆరు రాశులు కుడివైపు భాగమును,ఏడవరాశి నుండి పన్నెండో రాశి వరకు ఎడమవైపు భాగమును చూడవలెను.
ఆయారాశుల్లో పాపగ్రహాలు కాలపురుషుని ఏశరీర భాగమున్న స్ధానంలో స్ధితి నొందాయో, లగ్నాదిగా అదే అంగభాగంలో కూడ పాపాగ్రహాలు చేరి ఉన్నప్పుడు అట్టి అంగం బలహీనపడి వ్యాధిగ్రస్ధమవుతుంది. దీనికి గ్రహా కారకత్వాదులను కూడ అన్వయించి చూడాలి. జాతకుని శరీరభాగములలో ఏభాగం పరిపుష్టి కలిగి ఉండునో, ఏభాగం బలహీనంగా ఉండునో,ఆయా రాశులయందు ఉన్న గ్రహాముల శూభా శుభములను బట్టి తెలుసుకోవచ్చు. కాలపురుషుని అవయవ విభాగము మేషాది రాశుల నుంచి చూచినట్లుగానే జాతకుని అవయవ విభాగము లగ్నము నుండి చూడవచ్చును.
‘‘ మేషోశ్శిరోదవదనం వృషబో విధాతః
వక్షోభవేనృమిధునం హృదయం కుళీరం.
సింహస్ధదోధరమదో యువతిః కటిశ్చ.
వస్తిస్తు లాభృదదేవమేహ నమష్టమస్యాత్.
దన్వీచస్వాదూరుయుగం నక్రోజానుయుగంత
జంగద్వయంచ కుంభస్యా త్పాత ద్వితీయ మత్స్యభం’’
మేషరాశి:-శిరస్సు,మెదడును, వృషభరాశి- ముఖాన్ని,గొంతు, మెడ, టాన్సిల్స్, కన్నులు, ముక్కు, నాలుక, వేళ్ళగోళ్ళు
మిధునరాశి- ఉదరాన్ని,చేతులు,చెవులు,
కర్కాటకరాశి- హృదయం,స్తనాలు,ఊపిరితిత్తులు
సింహారాశి- పొట్ట,గుండె,వెన్నుపూస,
కన్యారాశి- నడుం,చిన్నప్రేవులు,ఆహారనాళం,
తులారాశి- పొత్తికడుపు,మూత్రపిండాలు,
వృశ్చికరాశి- జననాంగాలు,(బాహ్య జననేంద్రియాలు)
ధనస్సు రాశి- తొడలు,తుంట,
మకర రాశి – మోకాళ్ళు,
కుంభరాశి- పిక్కలు,చీలమండలు,
మీనరాశి- పాదాలు.
గ్రహాలు శరీరభాగాలు
రవి- శిరస్సు,హృదయం, కుడికన్ను, ఉదరం, ఎముకలు.
చంద్రుడు- ఎడమకన్ను,శరీరంలోని ద్రవాలు,స్త్రీల పునఃఉత్పత్తి అంగాలు,
కుజుడు- ఎముకలలో మజ్జ, హిమోగ్లోబిన్, పిత్తం, మెడభాగం,
బుధుడు- గొతు,ముక్కు,ఊపిరితిత్తులు,
గురువు- కాలేయం,పిత్తకోశం,చెవి,
శుక్రుడు- ముఖం,పునః ఉత్పత్తి అంగాలు ,వీర్యం,ప్రేగులు,
శని- కాళ్ళు,పాదాలు.
ఇలా ఆయా రాశులు, గ్రహాలు మన శరీరంలోని ఆయా అవయవాలను ప్రభావితం చేస్తాయి. రోగం వచ్చినప్పుడు మందుతోపాటు ఆయా గ్రహాల శాంతి చేసుకుంటే శ్రీఘ్రంగా రోగాలు నయమవుతాయి.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.