ఏ వత్తులతో దీపం పెడితే ఏం ఫలితం మీకు తెలుసా ?
దీపాల గురించి రకరకాల విషయాలు తెలుసుకున్నాం. అయితే దీపాలను వెలిగించడానికి నూనె లేదా నెయ్యి ఎంత ప్రధానమో వత్తులు అంతే ప్రధానం. ఆయా దోషాలు లేదా ఆయా ఫలితాలు కలగడానికి రకరకాల వత్తులు వాడాలని హిందూ పురాణలు పేర్కొంటున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం…
పత్తితో దీపము వెలిగించినదో ఆయువు పెరుగుతుంది. ఆరటి నారతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగుతుంది. జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాచాల బాధలు పోతాయి. తామరనార పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును.. ధనవoతులు అగుదురు. నూతన తెల్ల వస్త్రము -పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును. నూతన పసుపు వస్త్రము -అమ్మవారి అనుగ్రహమునకు లభిస్తుంది.
నూతన ఎరుపు వస్త్రము- వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి అదేవిధంగా సంతానం కాని వారికి సంతానము కల్గును. సాయంత్ర సమయము లందు శ్రీ మహాలక్ష్మి కి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం లభిస్తాయి. వీటికి అదనంగా రకరకాల వత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వారి వారి సమస్యలను బట్టి ఆయా వత్తుల దీపాలను భక్తి శ్రద్ధలతో పెడితే తప్పక శుభ ఫలితాలు లభిస్తాయి. శుచి, శుభ్రతతో దీపారాధన చేయడం చాలా ప్రధానమైన విషయం.