Karthika Masam : కార్తీకమాసం ఆడవారు దీపం ఈ సమయంలో పెడితే కోరి కష్టాలు తెచ్చుకోవడం ఖాయం…!
Karthika Masam : కార్తీకమాసం ఆడవారు దీపాన్ని ఏ సమయంలో పెడితే కోరి మరియు కష్టాలు తెచ్చుకున్నట్టో మీరు వివరంగా తెలుసుకుంటారు.. సాధారణంగా దీపం వెలిగించటం భగవంతుని ఆరాధించడం, పూజ చేయడం పరిహారాలు పాటించడం వ్రతాలు చేయటం నోములు చేయటం ఉపవాసాలు ఉండటం పుణ్యక్షేత్రానికి వెళ్ళటం, నదీ స్థానాలు ఆచరించటం ఏం చేసినా సరే మనకి మన కుటుంబ సభ్యులకి మంచి జరగాలని మనం పడుతున్న కష్టాల నుంచి బయట పడాలని లేదంటే ఏదో ఒక ఇబ్బంది […]
ప్రధానాంశాలు:
Karthika Masam : కార్తీకమాసం ఆడవారు దీపం ఈ సమయంలో పెడితే కోరి కష్టాలు తెచ్చుకోవడం ఖాయం...!
Karthika Masam : కార్తీకమాసం ఆడవారు దీపాన్ని ఏ సమయంలో పెడితే కోరి మరియు కష్టాలు తెచ్చుకున్నట్టో మీరు వివరంగా తెలుసుకుంటారు.. సాధారణంగా దీపం వెలిగించటం భగవంతుని ఆరాధించడం, పూజ చేయడం పరిహారాలు పాటించడం వ్రతాలు చేయటం నోములు చేయటం ఉపవాసాలు ఉండటం పుణ్యక్షేత్రానికి వెళ్ళటం, నదీ స్థానాలు ఆచరించటం ఏం చేసినా సరే మనకి మన కుటుంబ సభ్యులకి మంచి జరగాలని మనం పడుతున్న కష్టాల నుంచి బయట పడాలని లేదంటే ఏదో ఒక ఇబ్బంది నుంచి ఉపశమనం కలగాలని కోరుకుంటూ ఏం చేసినా భగవంతుని ఎంత ఆరాధించిన ఆ ఉద్దేశంతోనే చేస్తా అయితే భగవంతుని ఆరాధించేటువంటి విషయంలో కొన్ని నియమనిబంధనలు కచ్చితంగా పాటించాలి. దీపం ఏ సమయంలో పెట్టాలి. పూజలు ఏ సమయంలో ఏ విధంగా చేయాలి? భగవంతుని ఎలా ఆరాధించాలి. ఇలాంటి ముఖ్యమైన అంశాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రస్తుతం కార్తీక మాసం ఈ మాసంలో దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కార్తీకమాసంలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించిన, ఉట్టి నీటితో పరమశివుని అభిషేకించిన బిల్వదలాన్ని సమర్పించిన ఆ భగవంతుడు ఎంతో ముక్తుడై మన కోరికల్ని తీరుస్తాడు అంటారు.
ఆ పరమశివుడు బోలా శంకరుడు అనే పేరు ఉన్న కారణంగా మనం మనస్పూర్తిగా వేడుకున్నా సరే చేసినటువంటి పూజ చిన్నదైనా సరే ఆయన కచ్చితంగా కరుణిస్తాడు అని నమ్ముతారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో చేయాల్సిన పనుల గురించి చేయకూడని పనుల గురించి అలాగే దీపారాధన సంబంధించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం గురించి ఏ సమయంలో దీపారాధన చేయాలి. ఏ సమయంలో చేయకూడదు. దీపారాధనకు సంబంధించి నియమాలన్నీ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఈ కార్తీకమాసంలో దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో కచ్చితంగా తెలుసుకోవాలి. పురాణ కథల ప్రకారం శివుడు ఆషాడశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి జారుకుంటాడని మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని చెప్తారు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసున్ని సంహరించి విశ్వాన్ని రక్షించాడని అంటారు.
అలాగే ఈ సమయంలో గంగానది ఇతర నదులు చెరువులు, బావుల్లో ప్రవహించి ఆ నీటిని అమృతంగా మారుస్తుంది. అంటారు అందుకే ఈ నెలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో చేసేటువంటి నది స్నానానికి అలాగే కార్తీక మాసంలో రెండుసార్లు స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది. అలాగే సాయంత్రం పూట దీపం వెలిగించి పూజ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దు. అలాగే కార్తీక పురాణాన్ని చదవటం ఎవరైనా చదువుతుంటే వినటం లాంటివి చేయాలి. అలాగే ప్రసాదాన్ని పంచిపెట్టడం దానధర్మాలు చేయడం పండ్లను సమర్పించడం బ్రాహ్మణులకు దానాలు చేయటం లాంటివి చేస్తారు. ఇంట్లో అయితే మనస్పర్ధలు ఎప్పుడూ వ్యక్తుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో.. ఆ ఇంట్లో దీపారాధన ప్రతినిత్యం జరిగితే కచ్చితంగా ఉపశమనం కలుగుతుంది.
ప్రతిరోజు సరైన సమయంలో దీపాన్ని వెలిగించాలి. అప్పుడే ఆ దీపానికి అర్థము పరమార్థము ఏర్పడుతుంది. దీపారాధనని సూర్యోదయం కాకముందు నుంచి ఉదయం 10 గంటల వరకు పూజ చేసి దీపాలు వెలిగించాలి. ఈ సమయంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మనసులు ఇష్టదైవాన్ని వేడుకోవడం ద్వారా శుభం కలుగుతుంది. ఇక 10 గంటల తర్వాత నుంచి 5 గంటల వరకు కూడా దీపారాధనకి చెప్పదగ్గ లేదా సూచించదగ్గ సమయం కాదు. సాయంత్రం కూడా ఇంటిని శుభ్రపరచుకొని ఐదు గంటల సమయంలో కేవలం 6 గంటలకు దీపారాధన చేసేయాలి. ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక కార్తిక మాసంలో వెలిగించే దీపాలు కూడా ఈ సమయంలో వెలిగించడం ద్వారా పరమశివుని అనుగ్రహం మనపై కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉంటారు.