Eating : వాస్తు శాస్త్ర ప్రకారం సకార శక్తులను ఏ విధంగా ఆహ్వానించవచ్చు. మరియు ఇంటిలోకి సుఖ సంవృద్ధులను తీసుకురావడానికి ఏమేం పాటించాలి. అనేది వివరంగా చెప్పారు. ఆధునిక యుగంలో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. తద్వారా ప్రజలు మన ప్రాచీన సంస్కృతిని మర్చిపోతున్నారు. దాని ప్రభావం వారి జీవితాలపై పడుతుంది. భోజనం చేసేవారు తద్వారా భూమి మరియు వారి శరీరంలో ఉన్నటువంటి శక్తులు కలిసి వారికి మరింత శక్తి చేకూరేది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనుషుల్లో అనేకమైన బలహీనతలు ఏర్పడుతున్నాయి. అందుకే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అని పూర్వీకులు చెప్పారు. గ్రహాలు మనం తినే ఆహారం పై ప్రభావం చూపుతాయి అని తెలియజేశారు. అలాగే మనం భోజనం చేసే విధానం గ్రహాలపై కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు. వాస్తవంగా చూసినట్లయితే భోజనం చేసే దిక్కు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసే దిక్కు అనేది లేదా స్థలం అనేది బృహస్పతి యొక్క స్థానమని ఋషులు మునులు పేర్కొన్నారు. ఇలా చేస్తే ఆయుర్వృత్తి కలుగుతుంది. కింద కూర్చొని భోజనం చేస్తే చాలా మంచిది. అప్పుడు భూమి నీరు మరియు మనం తీసుకునే ఆహారం ఈ మూడింటి యొక్క శక్తి మన శరీరానికి అందుతుంది. అందుకే భూమి మీద కూర్చుని భోజనం చేయడం వల్ల మన శరీరానికి మరియు మన శిరస్సుకి శక్తి చేకూర్తుంది. అలాగే మన మనసును శాంతింప చేస్తుంది. మనలో ఉన్నటువంటి కోపాన్ని అణచివేస్తుంది. దక్షిణ మరియు తూర్పు దిశలకు మధ్యగా అనగా ఆగ్నేయ దిశగా కూర్చుని భోంచేస్తే యవన సంబంధ దోషాలు మరియు స్వప్న దోషాలు అనేవి కలుగుతాయి. అలాగే నేలపై బాసంపట్టు వేసుకుని కూర్చుని భోజనం చేయడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది.
కుర్చీ పైన కూర్చుని కాళ్లు ఊపుతూ భోజనం చేయడం అనేది చాలా దోషాలను మనకు తెస్తుంది. మనకు దరిద్రాన్ని కూడా తెస్తుంది. ఇక ఎవరికైతే ధనాన్ని ప్రాప్తించుకోవాలి అనే కోరిక ఉంటుందో డబ్బు కొదవగా ఉంటుందో వారు పశ్చిమ దిశకు కూర్చుని పశ్చిమ వైపు కూర్చుని భోజనం చేయడం అనేది ఉత్తమమైన పని. ఇలా చేయడం వల్ల వారికి ధనం ప్రాప్తిస్తుంది. తన సమయంలో మన ఒంట్లో ఉన్నటువంటి లివర్ నుండి వేడి అనేది బయటకు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలా బయటకు వస్తున్న వేడిని భూమి ఆకర్షించి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎప్పుడైతే మనం బెడ్ పైన కూర్చుని తింటామో ఒంటిలోని వేడిని భూమి ఆకర్షించకపోగా మరింత పెరుగుతుంది. భోజనం చేసిన తర్వాత కొందరు అన్నం తిన్నటువంటి కంచంలోనే చేయగదుగుతారు.
ఇలా చేస్తే మాత్రం అన్నపూర్ణ దేవిని అవమానించినట్టే… మరియు చంద్ర శుక్ర గ్రహాలు ఆగ్రహిస్తాయి. అలాగే కొంతమంది భోజనాన్ని ప్లేట్లు వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వలన మాత అన్నపూర్ణమ్మను అవమానించినట్టే.. ఇలా చేస్తే వారికి ముందు ముందు అన్నం దొరకడం కష్టమవుతుంది. అందుకే ఎంత అవసరమో అంతే భోజనాన్ని మనం పెట్టుకోవాలి. ఇక భోజనానికి ముందు మరియు తర్వాత కూడా లగు సంఖ్య చేయాలి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.