Zodiac Signs : రెండు అద్భుత యోగాలతో బలపడిన చంద్రుడు… ఈ రాశుల వారికి సిరిసంపదలు రాజభోగాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : రెండు అద్భుత యోగాలతో బలపడిన చంద్రుడు… ఈ రాశుల వారికి సిరిసంపదలు రాజభోగాలు…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని యోగాలు ఏర్పడతాయి. అయితే వీటి కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.ఇక సెప్టెంబర్ లో శుక్లపక్ష దశమి నాడు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీనితో అమృత సిద్ధ యోగం ఏర్పడింది. అయితే ఈసారి అమృత సిద్ధ యోగం శివయోగంతో పాటు ఏర్పడడం జరిగింది. శివయోగంతో పాటు అమృత సిద్ధయోగం ఏర్పడడం అనేది చాలా అరుదుగా జరిగే […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 September 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : రెండు అద్భుత యోగాలతో బలపడిన చంద్రుడు... ఈ రాశుల వారికి సిరిసంపదలు రాజభోగాలు...!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని యోగాలు ఏర్పడతాయి. అయితే వీటి కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.ఇక సెప్టెంబర్ లో శుక్లపక్ష దశమి నాడు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీనితో అమృత సిద్ధ యోగం ఏర్పడింది. అయితే ఈసారి అమృత సిద్ధ యోగం శివయోగంతో పాటు ఏర్పడడం జరిగింది. శివయోగంతో పాటు అమృత సిద్ధయోగం ఏర్పడడం అనేది చాలా అరుదుగా జరిగే యోగం. దీంతో రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికి చంద్రుడు రాజభోగాలను ,సిరిసంపదలను ఇవ్వనున్నాడు. మరి ఆ రాశులు ఏంటి..?రెండు గొప్ప యోగాలతో వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac Signs వృషభ రాశి

అమృత సిద్ధయోగం మరియు శివయోగం ఒకేసారి ఏర్పడడంతో వృషభ రాశి వారికి సత్ఫలితాలు వస్తాయి. ఇక ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఎలాంటి పని తలపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో వీరు అధిక శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. వృత్తి వ్యాపార రంగాలలో వచ్చే సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Zodiac Signs కుంభరాశి

సెప్టెంబర్ నెలలో ఏర్పడిన ఈ రెండు రాజయోగల కారణంగా కుంభరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. వీరి జీవితం సుఖ సంతోషాలతో కొనసాగుతుంది. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగ రంగంలో పురోగతి సాధిస్తారు. వర్తక వ్యాపార రంగాలలో లాభాలను గడిస్తారు. ఇక ఈ సమయం కుంభ రాశి వారికి అత్యంత శుభ సమయం అని చెప్పుకోవచ్చు.

కర్కాటక రాశి…

రెండు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం వలన కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. గతంలో వచ్చిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మేలు జరుగుతుంది. పెట్టుబడులలో విజయం సాధిస్తారు. ఈ సమయం వీరికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు.

సింహరాశి…

సింహరాశి జాతకులకు ఈ సమయం అద్భుతమైన సమయంగా పేర్కొనబడింది. ఈ సమయంలో వీరు ఎలాంటి పనిలోనైనా విజయాన్ని సాధిస్తారు. వ్యాపార రంగంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తొలగిపోతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయం వీరికి బాగా కలిసి వస్తుంది.

Zodiac Signs రెండు అద్భుత యోగాలతో బలపడిన చంద్రుడు ఈ రాశుల వారికి సిరిసంపదలు రాజభోగాలు

Zodiac Signs : రెండు అద్భుత యోగాలతో బలపడిన చంద్రుడు… ఈ రాశుల వారికి సిరిసంపదలు రాజభోగాలు…!

ధనుస్సు రాశి

రెండు రాజయోగాలు ఏర్పడడంతో ధనుస్సు రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ సమయంలో వీరు ఎక్కువగా శుభవార్తలను వింటారు. కుటుంబ కలహాలు తొలగి సుఖసంతోషాలతో జీవిస్తారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది