Zodiac Signs : కన్య రాశిలో రెండు గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం… దశ తిరిగినట్లే…!
Zodiac Signs : ఈనెల 24న కన్యారాశి లోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. అయితే ఇప్పటికే కన్యరాశిలో రాహు కేతువులు సంచరిస్తున్నారు. ఇక 24వ తేదీన రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కన్యరాశిలో సంచరిస్తాడు. అయితే ఇలా రెండు గ్రహాలు ఒకేసారి సంచరించడం వలన వచ్చే నెల 18వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. అలాగే వీరికి అకస్మాత్తుగా డబ్బులు రావడం, ఊహించని సహాయాలు అందడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయం ఈ […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : కన్య రాశిలో రెండు గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం... దశ తిరిగినట్లే...!
Zodiac Signs : ఈనెల 24న కన్యారాశి లోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. అయితే ఇప్పటికే కన్యరాశిలో రాహు కేతువులు సంచరిస్తున్నారు. ఇక 24వ తేదీన రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కన్యరాశిలో సంచరిస్తాడు. అయితే ఇలా రెండు గ్రహాలు ఒకేసారి సంచరించడం వలన వచ్చే నెల 18వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. అలాగే వీరికి అకస్మాత్తుగా డబ్బులు రావడం, ఊహించని సహాయాలు అందడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయం ఈ రాశి వారికి వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. మరి ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Zodiac Signs సింహరాశి
సింహరాశి వారికి ఈ సమయంలో ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే అదనపు మార్గాల ద్వారా ఆదాయాన్ని అందుకుంటారు. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు స్వగ్రామంలో ఉద్యోగాలను సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శుభ కార్యాలు జరుగుతాయి.
Zodiac Signs వృషభ రాశి
వృషభ రాశి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. పిల్లలు లేనటువంటి వారికి సంతానయోగం ఉంటుంది. అలాగే పిల్లలు మంచి విజయాలను సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో వస్తున్న కష్టాల నుంచి బయటపడడంతో పాటు ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
Zodiac Signs కన్యా రాశి
కన్య రాశి వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు. సమాజంలో పలుకుబడి మరియు పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే తల్లిదండ్రులను ఈ సమయంలో కలుసుకుంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలను పొందుతారు. అలాగే ఉద్యోగులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. పెళ్లి కానీ మీన రాశి వారికి పెళ్లి కుదురుతుంది. వీరు ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారికి చికిత్స లభిస్తుంది. ఉద్యోగస్తులు వారి చేస్తున్నటువంటి ఉద్యోగంలో పేరు తెచ్చుకుంటారు.
మకర రాశి
మకర రాశి వారు ఈ సమయంలో విదేశాల నుంచి అవకాశాలను పొందుతారు. అలాగే విదేశీ సొమ్మును అనుభవించే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. అలాగే జీవితంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో మకర రాశి వారికి తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి.