Zodiac Signs : శుక్రుని అనుగ్రహంతో త్వరలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: September 10, 2024, 1:00 pm
  •  Zodiac Signs : శుక్రుని అనుగ్రహంతో త్వరలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం...!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలకు అధిపతిగా శుక్రుని భావిస్తారు. అలాగే శుక్ర గ్రహానికి ఉండే స్థానం ప్రత్యేకమైనది. మరి అలాంటి శుక్రుడు జాతకంలో మంచి స్థానంలో కనుక ఉన్నట్లయితే శుభ ఫలితాలను ఇస్తాడు. ఒకవేళ చెడు స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు ఉంటాయి. ప్రస్తుత శుక్రుడు నీచరాశి నుంచి తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు.

Zodiac Signs తులా రాశిలోకి శుక్రుడు

సెప్టెంబర్ 18న భాద్రపద శుక్లపక్ష పూర్ణిమ తిధినాడు మధ్యాహ్నం 2:04 నిమిషాలకు నీచరాశి అయినా కన్యారాశి నుంచి తన సొంత రాశి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు తులా రాశిలో సంచారించడం వలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac Signs మేష రాశి

సెప్టెంబర్ నెలలో శుక్రుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మాసంలో జరిగే శుక్ల గోచారం వలన మేష రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మరో 10 రోజులో వీరు మంచి ఫలితాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో రాణిస్తారు. మేషరాశి జాతకుల ఉద్యోగస్తులకి ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగ్య స్వామితో విలాసవంతమైన జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.

తులారాశి

శుక్రుడు కన్యరాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించడం వలన తులా రాశి జాతకులకు మంచి ఫలితాలు ఉంటాయి.అలాగే వీరికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో వీరికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారులు లాభాలను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది.

Zodiac Signs : శుక్రుని అనుగ్రహంతో త్వరలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం...!

Zodiac Signs : శుక్రుని అనుగ్రహంతో త్వరలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…!

మకర రాశి

శుక్రుడి సంచారం కారణంగా మకర రాశి వారు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే కొత్త బాధ్యతలను స్వీకరించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుతారు. ఈ సమయంలో మకర రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp