February Rasi Phalalu : ఫిబ్రవరిలో ఈ 4 రాశులకు విపరీతంగా ఆర్థిక నష్టం జరుగుతుంది… ఆ రాశులు ఏంటో తెలుసా..?
ప్రధానాంశాలు:
February Rasi Phalalu : ఫిబ్రవరిలో ఈ 4 రాశులకు విపరీతంగా ఆర్థిక నష్టం జరుగుతుంది...ఆ రాశులు ఏంటో తెలుసా..?
February Rashi Phalalu : 2025వ సంవత్సరము ఫిబ్రవరి రెండో నెల ప్రారంభం అయింది. ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని రాశులకు గ్రహాలు మరియు నక్షత్రాలు సంచారం అనుకూలంగా లేదు. జ్యోతిష్యాల అభిప్రాయం ప్రకారం. ఈ నెలలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. దీంతోపాటు ఖర్చులు కూడా అధికంగా పెరుగుతాయి. మీ రాశిల వారికి ఫిబ్రవరి నెలలో ధనం ప్రవాహం తగ్గవచ్చు. దీంతోపాటు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం అందకపోవచ్చు. ఆర్థికంగా చాలా నష్టపోతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…
February Rasi Phalalu మిధున రాశి
మిధున రాశి వారికి ఈ నెలలో ఖర్చులు అధికమవుతాయి. మీకు ఆదాయం ఎంత ఉన్నా కానీ ఖర్చులు కూడా అంతే ఉంటాయి. కుటుంబంలో అవసరాల కొరకు ఖర్చులు అధికంగా చేస్తారు. ఈ మిధున రాశి వారు ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి చేయాల్సి ఉంటుంది. నెల వచ్చేసరికి ధనమును దాచుకోవడం వలన ఆర్థిక సమస్యను ఎదుర్కోవచ్చు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండడం వల్ల అధిక పరిస్థితి వలన ఒత్తిడికి లోనవుతారు. విపరీతంగా ఈ కర్కాటక రాశి వారికి ఆర్థిక నష్టం ఎక్కువగా జరుగుతుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని మొదలు పెడితే దానికి ఆలోచించి డబ్బుని పెట్టుబడిగా పెట్టడం చాలా అవసరం. లేదంటే విపరీతంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నెలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నెల మొదటి అర్థం భాగంలో చేయవచ్చు. ఏదైనా కానీ పెట్టుబడులు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
తులా రాశి : తులా రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థికంగా హెచ్చుతగ్గులు కనపడతాయి. డబ్బు ఎలా అయితే వస్తుందో అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ నెల తులా రాశి వారికి సవాల్ గా మారుతుంది. మీరు డబ్బుని అవసరాల మేరకు మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. అవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి.
కుంభరాశి : కుంభరాశి వారి ఈ నెలలో ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి విపరీతమైన ఖర్చులు పెరుగు వచ్చు. మీ కుటుంబం కొరకు ఖర్చులను అధికంగా చేస్తారు. కుటుంబంలో ఆదాయం పెరుగుతుంది కానీ ఆదాయం కొరకు శ్రమ చేయాల్సి ఉండడం వల్ల ఎక్కువ ఉత్తిడి కలుగుతుంది.
సంపదను పెంచుకొనుటకు పరిహారం ఇలా చేయండి : ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే స్నానం ఆచరించి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవికి ఇష్టమైన సువాసన గల సుగంధ ద్రవ్యాలను సమర్పించండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన పరమన్నాన్ని శుక్రవారం నాడు నివేదన చేయండి. అమ్మవారు ముందు నెయ్య దీపాన్ని వెలిగించి కనకధార సోత్రాన్ని పఠిoచండి. నెలలో మొదటి రోజున లక్ష్మీదేవికి ఒక కన్ను కొబ్బరికాయను సమర్పించి దానిని డబ్బు స్థానంలో ఉంచండి.