Hyderabad : తోట్ల మల్సూర్ 26వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad : తోట్ల మల్సూర్ 26వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

 Authored By prabhas | The Telugu News | Updated on :12 March 2026,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Hyderabad : తోట్ల మల్సూర్ 26వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Hyderabad  : హైదరాబాద్‌లోని వృత్తిదారుల భవనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కల్లుగీత కార్మిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తోట్ల మల్సూర్ 26వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ అధ్యక్షత వహించారు. ప్రారంభంలో మల్సూర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తోట్ల మల్సూర్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. భూమి కోసం, ప్రజల విముక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ఆయన ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. సమ సమాజం ఏర్పడాలని లక్ష్యంగా పెట్టుకుని దొరలు, జాగిర్దారులు, జమీందారుల దోపిడికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన పోరాట యోధుడు మల్సూర్ అని కొనియాడారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన అనేక ప్రజా పోరాటాలు నిర్వహించి కార్మికుల హక్కుల సాధనకు కృషి చేశారని తెలిపారు.

Tributes paid to Thotla Malsur on his 26th death anniversary

Hyderabad : తోట్ల మల్సూర్ 26వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

కార్మికుల జీవనోపాధి, సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా మల్సూర్ గుర్తింపు పొందారని అన్నారు. మల్సూర్ ప్రజా ప్రతినిధిగా కూడా విశిష్ట సేవలు అందించారని నాయకులు గుర్తు చేశారు. నూతనకల్లు జడ్పిటిసి సభ్యుడిగా, వెలకపల్లి సింగిల్ విండో చైర్మన్‌గా, శిల్పకుంట్ల గ్రామ సర్పంచిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన ఆయన ఆశయాలను సంఘం రాష్ట్ర కమిటీ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకదారుల రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ళఆశయ ,మత్స్యకా రుల హైదరాబాద్ సిటీ చైర్మన్ కొప్పు పద్మ , బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజు నాగరాజు, చౌరవృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేష్ ,సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. వెంకట నరసయ్య ,తొలుత మల్సూర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సంఘం సీనియర్ నాయకులు అబ్బ గాని బిక్షం తదితరులు పాల్గొన్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి