GangaMata : నీకంటే నేనే గొప్ప అంటూ ఆవుతో గొడవ పడ్డ గంగాదేవి .. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..!

GangaMata : ఒకరోజు నారద మహర్షికి భూలోకాన్ని తిరిగి రావాలి అనే కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా వెంటనే భూలోకం బయలుదేరీ వచ్చాడు. అలా భూలోకం మొత్తం తిరుగుతూ ఉండగా కొన్ని విషయాలు గమనించాడు. ప్రతిచోట గోమాతకి, గంగా మాతకి మనుషులు పూజలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇది చూసిన నారద మహర్షికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. భూలోకం మొత్తం వీరిని ఇంతలా ఆరాధిస్తున్నారు కదా అసలు వీళ్లల్లో ఎవరు గొప్ప చూద్దాం అనుకున్నాడు. వెంటనే నారద మహర్షి మొదట గంగామాత దగ్గరికి వెళ్ళాడు. వెళ్లి గంగామాతతో ఈ భూలోకంలో నిన్ను ఎక్కువగా కీర్తిస్తారు , పూజిస్తారు అనుకున్నాను. కానీ చాలా ప్రదేశాలలో నీకంటే గోమాతనే ఎక్కువగా పూజిస్తున్నారు. నీకు ఇవ్వాల్సిన గౌరవం, పూజలు గోమాతకు ఎందుకు ఇస్తున్నారు అంటూ గంగామాతను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు.

అయితే ఆ తర్వాత ఒకరోజు గోమాతకు దాహం వేసి నీళ్లు తాగుదామని పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు త్రాగటం మొదలుపెట్టింది. అప్పుడు గంగామాత ఆవును చూసి అమ్మా గోమాత అందరూ నిన్ను గొప్పగా చూస్తున్నారు కానీ నీకంటే అన్నింట్లో నేనే గొప్ప. నీకంటే పెద్దదాన్ని నీకంటే పవిత్రమైన దాన్ని ప్రతి ఇంట్లోనూ నన్ను పూజిస్తారు. ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది. నేను లేనిదే భూమిపైన ఏదీ లేదు. నేను అందరికంటే గొప్పదాని, మీకు దాహం వేస్తే నా దగ్గరికి రావాలి సరే వస్తే వచ్చావు వచ్చి పవిత్రంగా ఉన్న నా నీటిని ఎందుకు అపవిత్రం చేసావు, నీ పేడను పవిత్రమైన నీటిలో కలిపి మొత్తం అపవిత్రం చేస్తున్నావు, నువ్వేమీ అంత గొప్ప దానివి కాదు కానీ అందరూ నిన్ను ఎందుకు పూజిస్తున్నారో అర్థం కావడం లేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు పునీతులు అవుతారు నీ దగ్గర ఏముంది నువ్వు ఒక మామూలు జంతువు మాత్రమే అని అంటుంది.

GangaMata quirrel with cow

రోజు అందరితో చాలా మంచిగా ఉండే గంగా ఈరోజు ఎందుకిలా మాట్లాడుతుంది అని ఆలోచించిన గోమాత గంగామాత తో నువ్వు చాలా అహంకారంగా మాట్లాడుతున్నావు. నీకు మితిమీరిన కోపం, అహంకారం ఉన్నందుకే కదా నిన్ను శివుడు తన తలలో పెట్టుకున్నాడు. లేకపోతే నువ్వు అందరినీ ముంచేసి చంపేయగలవు. అందుకే నిన్ను ఎవరు కీర్తించరు అంటుంది. అప్పుడు గంగ మనుషులు నాలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. చనిపోయిన తర్వాత అస్తికలు నాలో కలిపి వెళతారు. నేను ప్రవహించే దగ్గర ఘాట్లు కట్టుకొని పూజలు చేస్తారు. గొప్ప గొప్ప ఋషులు, సన్యాసులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకుంటారు. పాపాలు పోగొట్టే నేను నీకంటే చాలా గొప్ప అని నాలాగా నువ్వు పాపాలు పోగొట్టగలవా అంటూ గంగా మాత గోమాతను గట్టిగా అడిగింది.

దీంతో గోమాత గంగమ్మ నువ్వు అన్నది నిజమే నువ్వు చాలా గొప్ప దానివి కానీ నీ కన్నా చాలా విషయాల్లో నేను గొప్ప. ఈ ప్రపంచం మొత్తం నా పాలతోనే రోజు మొదలవుతుంది. నా పాలు తాగితే పుణ్యం వస్తుంది. నా పాలు తాగి దీర్ఘాయుష్షు పొందుతారు. శ్రీకృష్ణుడు నా పాల వెన్నని తిని గొప్పవాడు అయ్యాడు. నా పాలు ద్వారా వచ్చే పెరుగు, నెయ్యి అందరికీ అమృతంతో సమానం. అంతేకాదు నా పేడ కూడా ప్రపంచానికి మేలు చేస్తుంది పేడతో పిడకలు చేసి వంట వండుకుంటారు. అలాగే ఆవు పేడ ఈ భూమి మొత్తం స్వచ్ఛంగా చేస్తుంది. దాని వలన పంటలు బాగా పండుతాయి. మనుషులు తింటే రోగాలు రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రజలు నన్ను ఆరాధిస్తారు. అలాంటిది నువ్వు నా కన్న గొప్ప దానివి ఎలా అవుతావు అని గోమాత అడిగింది. దీంతో నారద మహర్షి ఇద్దరూ గొప్పవారే అని ఎవరికి వారు తమ పనులతో గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి ఎవరు గొప్ప అనే ప్రశ్నకు ఇద్దరు గొప్పవారే అని చెప్పాడు.

Recent Posts

Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…

46 minutes ago

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో

Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…

2 hours ago

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

3 hours ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

3 hours ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

7 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

8 hours ago

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

9 hours ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

10 hours ago