Deeparad : ఎన్ని వత్తులు వేస్తే ఏం ఫలితమో మీకు తెలుసా ?
Deeparad , దీపారాధన.. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనది. ఏ పూజ ప్రారంభించినా మొదట చేయాల్సినది దీపారాధన అయితే ఈ దీపారాధనలు అనేక రకాలు.. ఒక్క జ్యోతి, అనేక జ్యోతులు, అఖండ దీపారాధన ఇలా అనేక రకాలు. వాటితోపాటు ఆ దీపాలలో ఎన్ని వత్తులు వేయాలి అనేది చాలామందికి సంశయం. ఎన్ని వత్తులు వేస్తే ఏం ఫలితం, ఏ రకం వత్తులు వాడితే ఏం ఫలితమో తెలుసుకుందాం….
ఒక_వత్తి – సామాన్య శుభం, రెండువత్తులు- కుటుంబ సౌఖ్యం, మూడువత్తులు- పుత్ర సుఖం, ఐదువత్తులు- ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం, అభివృద్ధి.. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠం. దీపారాధనకు నువ్వుల నూనె, కుసుమ, ఇప్పనూనె లేదా ఆవునెయ్యి వాడాలి. ఎవరి శక్తికొలది వారు నూనెలను వాడవచ్చు. దీపం సాధారణంగా తూర్పు లేదా ఉత్తరం లేదా దేవుడికి అభిముఖంగా పెట్టవచ్చు. దక్షిణంగా మాత్రం పెట్టకూడదు. మట్టి లేదా ఇత్తడి లేదా కంచు ప్రతిమల్లో దీపారాధన చేయడం మంచిది.