Home » Devotional » If Goddess Lakshmi Is Roaming Around In Your House
Devotional

Lakshmi : మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే కనిపించే సూచనలు ఇవే…!

Authored By
aruna
The Telugu News | Published on: September 7, 2023, 8:00 am
Advertisement

Lakshmi : ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి. మరి మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నప్పుడు ఏలాంటి సూచనలు కనిపిస్తాయి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. లక్ష్మీదేవి మన ఇంట్లో తిరిగితే కొన్ని సూచనలు కనిపిస్తాయి. సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారింట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయవచ్చు. అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అమ్మవారు మన ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి.

Advertisement

మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మొదటి సూచన ఏమిటి అంటే సువాసన మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. మంచి సువాసనలు అంటే అగరవత్తుల వాసన గాని మీ ప్రమేయం ఏమీ లేకుండా సూచనలు రావాలి. ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతోందని అర్థం. ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తోందని తెలిపేటువంటి మొదటి సూచన. ఇక రెండవ సూచన ఏంటంటే కోయిల లేదా ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కాని లేదా సాయంత్రం కానీ వచ్చి అరుస్తూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతోందని అర్థం. ఆ ఇంట్లో వారికి కోయిల గొంతు వినిపిస్తుంది. ఇట్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా ఉన్నా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది.

If Goddess Lakshmi is roaming around in your house

Advertisement

లేదా ఒత్తులు కదులుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్లారని మీ దీపారాధనను స్వీ కరించాలని అర్థం. అమ్మవారి ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతోందని తెలిపేటువంటి సంకేతం. అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే దేవుని ఫోటోలు పక్కకు వరగటం కానీ పక్కకు జరగటం కానీ లేదా కింద పడిపోవడం గాని జరుగుతూ ఉంటాయి. ఇలా కిందపడిన పక్కకు ఒరిగిన వెంటనే ఆ ఫోటోలు యధా స్థానంలో పెట్టేయండి. ఇలా జరిగితే అమ్మవారి వచ్చి వెళ్ళారని అర్దం అమ్మవారు అందరి ఇళ్లలో తిరగరని మీ ఇంట్లో తిరిగారని గుర్తుపెట్టుకోండి. అమ్మవారు కొందరి ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు. అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలి అంటే గొప్ప అదృష్టం ఉండాలి. అదృష్టం ఉన్న వారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్థాయి.

మన ఇంట్లో అమ్మవారు తిరుగుతూ ఉన్నప్పుడు మనం అన్నీ కూడా మంచి పనులే చేయాలి. మంచి పనులు చేస్తే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళదు. అసలే అమ్మవారికి చంచల అనేటువంటి పేరు కూడా ఉంది. మరి ఆ పేరు సార్ధకం చేసుకుంటూ అమ్మవారు ఎక్కడా కూడా నిమిషం కూడా నిలవదు. అమ్మవారికి ఎక్కడ ఇష్టమైతే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరలా అమ్మవారిని వెళ్ళనివ్వకుండా పూజలు చేసుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు వండి పెడుతూ అన్ని మంచి పనులు చేస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి