Shani Doshas : ఈ మొక్కను శనివారం నాడు పూజిస్తే చాలు కష్టాలు తో పాటు శని దోషాలు కూడా పోతాయి…!
Shani Doshas : ప్రకృతిలో ఎన్నో మొక్కలు మనకు మేలు చేసేవి ఉన్నవి.. కొన్ని ఆయుర్వేదంలో వ్యాధులకు తగ్గించేవి.. ఇంకొన్ని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పూజించబడేవి. ఈ మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటిని పూజించడం వలన ఎన్నో గ్రహాల దోషాలు తొలగిపోతాయి. అలాగే దేవతలు కూడా సంతోషిస్తారు.
అలాగే గృహంలో శ్రేయస్సు అభివృద్ధి ఆనందం పొందడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ మొక్కల్లో శమీ మొక్క ఒకటి ఈ మొక్కను శని దేవుడి మొక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే శివునికి ఈ మొక్క ని సమర్పించడం ద్వారా ఆ పరమేశుడు త్వరగా అనుగ్రహిస్తాడు. అని నమ్ముతుంటారు. అలాగే శమీ మొక్కను పూజించడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతుంటారు.
శనివారం నాడు ఈ చెట్టుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.. ఈ మొక్కను శనివారం రోజు శని దేవుడిని పూజించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దాంతోపాటు ఆనాడు శమీ చెట్టుని నీరు పోసిన పుణ్యఫలం వస్తుంది. అలా చేయడం వలన శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. కావున మీరు కావాలంటే శనివారం రోజు ఇంటి దక్షిణ దిశలో ఈ చెట్టును పెట్టుకోవడం శుభప్రదం ఈ దిశలో ఎక్కువగా సూర్య కాంతి లేకపోతే మీరు దానిని తూర్పు లేదా ఈశాన్య దిశలో పెట్టవచ్చు..అదేవిధంగా ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే శనివారం రోజు ఈ మొక్కను నాటాలి. అలాగే దానిని ప్రధాన తలుపు కుడి వైపున కూడా పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం వలన ధన లాభం కలుగుతుంది. శనివారం రోజు శమీ చెట్టుని పూజించాలి.
దాంతోపాటు ఐదు ఆకులను తీసి శివునికి అర్పించాలి. తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన పర్సులో డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటారు. శని దేవుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శనివారం నాడు శమీ వృక్షం కింద ఆవాల నూనెతో దీపం పెట్టాలి. అనవసరంగా ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నట్లయితే శనివారం ఉదయం నిద్ర లేచి తలస్నానం చేయాలి. దాని తర్వాత శమి వృక్షం మూలానికి తమలపాకులు ఒక రూపాయి నాని పెట్టాలి. ఈ విధంగా చేయడం వలన డబ్బు కష్టాల నుంచినుంచి బయటపడతారు. మీరు అప్పుల నుండి బయటపడాలి అనుకుంటే శమీ వృక్షం వేరు దగ్గర కొద్దిగా నల్లటి మినప్పప్పు పెట్టాలి. ఈ విధంగా చేయడం వలన అప్పుల బాధ నుంచి బయటపడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.