Central Govt : డీజిల్, గ్యాస్ కొరతకు కేంద్రం చెక్ .. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా అమలు ..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 10 March 2026, 1:00 pm
  •  Central Govt : డీజిల్, గ్యాస్ కొరతకు కేంద్రం చెక్ .. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా అమలు ..!

Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చమురు శుద్ధి సంస్థల కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకుని అత్యవసర వస్తువుల చట్టం (ఎస్మా)ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా డీజిల్, వంటగ్యాస్ వంటి అవసరమైన ఇంధనాల సరఫరా సజావుగా కొనసాగడం చాలా ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కొన్నిచోట్ల కార్మికుల సమ్మెలు లేదా ఇతర కారణాలతో చమురు శుద్ధి సంస్థల పనితీరు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్మా అమలు వల్ల చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన నిల్వలు, పంపిణీ వ్యవస్థలు నిరంతరంగా పనిచేయాల్సి ఉంటుంది.

Central government considering implementing ESMA on oil refineries

Central Govt : డీజిల్, గ్యాస్ కొరతకు కేంద్రం చెక్ .. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా అమలు ..!

ఎస్మా అమలులోకి వచ్చిన తరువాత చమురు శుద్ధి సంస్థల్లో పనిచేసే సిబ్బంది సమ్మెలకు వెళ్లడం లేదా పనిని నిలిపివేయడం చట్టపరంగా నిషేధం అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇంధన ఉత్పత్తి, నిల్వ, పంపిణీ ప్రక్రియలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని కేంద్రం స్పష్టం చేసింది. అవసరమైనప్పుడు ప్రభుత్వానికి అదనపు నియంత్రణాధికారాలు కూడా ఉంటాయి. ప్రజలకు డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ వంటి అవసరమైన ఇంధనాలు నిరంతరంగా అందేలా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు వంటి రంగాలకు ఇంధనం అత్యవసరం కావడంతో సరఫరాలో చిన్న అంతరాయం కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ముందస్తు చర్యగా ఎస్మా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ చర్యతో ఇంధన రంగంలో స్థిరత్వం కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి