Lakshmi Devi : ప్రతీ మనిషి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు సహజమే. అయితే వాటిని తట్టుకుని ముందుకు వెళ్తేనే మన జీవితం హాయిగా సాగుతుంటుంది. మరి ఈ కష్టాలను తట్టుకోవాలన్నా.. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవాలన్నా కొన్ని పూజలు చేయాలంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇలాంటి పూజలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతంత లభించి… సమస్యలను అధిగమించే శక్తి వస్తుందని వివరిస్తున్నారు. అంతే కాదు లక్ష్మీ దేవి కటాక్షం పొందితే… అష్ట ఐశ్వర్యాలు మన వెంటే ఉంటాయని అంటున్నారు. అయితే మనకు సమస్యలు మరీ ఎక్కువైనప్పుడు కష్టాల నుంచి సుఖాల వైపు మనల్ని మళ్ళించ గలిగే శక్తి ఆ లక్ష్మీదేవికి మాత్రమే ఉంది. అయితే ఆ లక్ష్మీ దేవిని పూజిస్తూ.. అష్ట లక్ష్మీ స్తోత్రం చదివితే.. మనకు అంతా మంచే జరుగుతుందని తిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మీ పరిపాలయ మామ్ || 1 ||
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 2 ||
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||విద్యాలక్ష్మీ:-
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మీ రూపేణా పాలయ మామ్ || 8 ||
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.