Ksheerabdi Dwadasi : పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం ” కార్తీక మాసం”. ఈ నెల అంతా కూడా వివిధ పండుగలు ఉత్సవాలు ఉంటాయి. అయితే ఇందులో క్షీరాబ్ది ద్వాదశి ఎంతో విశిష్టమైనది. కార్తీక మాసంలోని శుక్లపక్షం వచ్చే ద్వాదశి ని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని అంటారు. ఈ రోజున దేవతలు దానవులు అమృత కోసం పాలసముద్రాన్ని చిలికారట అందుకే దీనిని చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. ఇక ఈనెల 13వ తేదీన బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ఏకాదశి రావడం జరిగింది. అయితే ఈ రోజున మహిళలు తులసి కోట వద్ద కొన్ని నియమాలను పాటించాలి. ఇలా చేయడం వలన శ్రీ మహా విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం తో పాటు తులసి మాత అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యం పండితులు చెబుతున్నారు.
కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగా నిద్ర నుంచి మేల్కొంటాడు. ఇక మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతంగా దేవతలతో కలిసి బృందావనానికి వస్తాడు. అలాగే శ్రీ మహా విష్ణువు దామోదరుడు అనే అవతారంతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు. ఇలా విష్ణు సంబంధమైన ఆలయాలను క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి దామోదరుల కల్యాణాన్ని ఘనంగా జరిపిస్తారు. ఆ రోజున పెళ్లయిన దంపతులు దేవదేవతల కళ్యాణ వేడుకను తిలకించి అక్షింతలను వేసుకుంటే చాలా మంచిది.
– క్షీరాబ్ది ద్వాదశి రోజున స్త్రీలు సూర్యోదయాన్ని కంటే ముందుగానే నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి.
– తులసి కోట దగ్గర ఆవుపేడతో అలకాలి లేదా నీటితో శుద్ధి చేయాలి.
– అనంతరం తులసి కోట వద్ద బియ్యం పిండితో చక్రము శంఖము పద్మము స్వస్తిక్ గుర్తులుతో ముగ్గు వేయాలి.
– ఈ ముగ్గులు వేయడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఆ కుటుంబం పై ఉంటుంది.
– తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి 9 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.
– తులసి కోటకు గులాబీ పూలు మరియు తెల్ల పువ్వులను సమర్పించాలి. అదేవిధంగా నైవేద్యంగా దానిమ్మ గింజలు ద్రాక్ష పండ్లు అరటి పండ్లను పెట్టాలి.
-ఓం బృందావనీయమ నమః ” అనే మంత్రాన్ని చెబుతూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి.
-ఈ పూజా విధానాన్ని సాయంత్రం పూట కూడా పాటించవచ్చు.
– క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆకలితో ఉన్నవారికి పెరుగు అన్నాన్ని దానంగా ఇవ్వండి.
– అలాగే ఈరోజు తులసి కోట దగ్గర చలిమిడితో చేసిన దీపాలను వెలిగించడం చాలా మంచిది.
– సాయంత్రం వేళ తులసి కోట దగ్గర పూజ ముగిసిన తర్వాత ముత్తైదువులను పిలిచి వారికి వాయనం అందించడం చాలా శుభప్రదంగా పేర్కొనబడింది.
– క్షీరాబ్ది ద్వాదశి పండుగ రోజు ఇలాంటి ఈ పూజా విధానాన్ని పాటించడం వలన ఇంట్లో శుభ ఫలితాలు కలగడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
Sukumar : పుష్ప 1 వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అసలైతే…
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
Ys Sharmila : ఏపీలో AP News జగన్ Ys Jagan , షర్మిళ మధ్య జరుగుతున్న ఫైటింగ్ చర్చనీయాంశంగా…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకం ఇచ్చి నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయం…
Kanguva Movie Review : కోలీవుడ్ Kollywood స్టార్ Surya సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో…
Pineapple : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో పైనాపిల్ కూడా…
Lagcherla : ఫార్మా సిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 11న విచారణ సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాస్‌పేట మండలం…
Prabhas Raja Saab : స్టార్ సినిమాను మొదలు పెట్టడం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చాలా సులువే కానీ…
This website uses cookies.