Online Fraud : ఆన్‌లైన్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న డాక్టర్.. రూ.76.5 లక్షలు స్వాహ
Online Fraud : డిజిటల్ ప్రపంచంలో Digital World పెరుగుతున్న సైబర్ నేరాల cyber crime గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో… నేటి రోజుల్లో, ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం విస్తృతంగా పెరిగింది, ముఖ్యంగా యువతలో, అయితే దీనితో పాటు సైబర్ నేరాల ప్రమాదం కూడా పెరిగింది.నకిలీ స్కీమ్ లతో పెద్ద పెద్ద వాళ్లని కూడా మోసం చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా ఒక ప్రభుత్వ వైద్యుడు స్కామర్‌ల బారిన పడ్డాడు, పెట్టుబడులపై అధిక రాబడిని ఇస్తామని వాగ్దానం చేసి మోసగించి ₹76.5 లక్షలు పోగొట్టుకున్నాడు.తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడిని మోసగాళ్లు నట్టేట ముంచారు.
యూట్యూబ్ ఛానల్‌లోని youtube channel ఒక ప్రకటనను నమ్మి అక్కడి లింక్‌పై క్లిక్ చేయడంతో ఏకంగా 76.5 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసగాళ్లతో నిండిన ఓ వాట్సప్ గ్రూప్‌కు ఆ లింక్ ద్వారా రీడైరెక్ట్ అయినట్లు డాక్టర్ తెలిపారు. అక్కడ పలువురు నకిలీ ఇన్వెస్టర్స్ లాభపూరిత వ్యూహాల గురించి చర్చిస్తూ తన విజయగాథలను షేర్ చేసినట్లు వెల్లడించారు.దివాకర్ సింగ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఆ గ్రూప్ నడపబడతున్నట్లు డాక్టర్ తెలిపారు. తరచుగా వ్యాపార సూచనలు, పెట్టుబడి సలహాలు ఇస్తూ తనలో నమ్మకాన్ని పెంచారని చెప్పారు. దీంతో ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కోసం గ్రూప్‌లో సూచించిన ప్లాట్‌ఫారమ్‌లో ఖాతా తెరిచినట్లు వివరించారు.
Online Fraud : ఆన్‌లైన్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న డాక్టర్.. రూ.76.5 లక్షలు స్వాహ
నమ్మకం కలగడంతో వారి సూచనలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టడం సైతం ప్రారంభించానన్నారు.పెట్టుబడులు పెడుతున్న కొద్ది లాభాలు పెరుగుతాయని నమ్మబలికి తనని మోసం చేసినట్టు అతను చెప్పుకొచ్చాడు. 30 శాతం లాభాలను వాగ్దానం చేయడంతో వారిని గుడ్డిగా నమ్మినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అదనపు ఫీజు అడగడంతో మోసానికి గురయ్యారనే విషయం తనకి అర్ధమైందని ఆయన వాపోయారు. అందుకే ఎవరు ఎప్పుడు కూడా అనధికృత లింకులు ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయవద్దని సూచన చేస్తున్నారు.
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
This website uses cookies.