Mruthyunjaya Homam : మృత్యుంజయ హోమం చేస్తే.. మృత్యువు ఆగిపోతుందా?
Mruthyunjaya Homam : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం చాలా పూజలు, హోమలు చేస్తాం. అలాగే మనకు ఏదైనా దోషం పట్టిందని తెల్సినా… లేక ఆరోగ్యం బాగా లేకపోయినా అందుకు పరిహారంగా మరిన్ని పూజలు జరిపిస్తుంటాం. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అలాగే అందరూ పాటించేవే. అందులో భాగంగానే చాలా మంది మన ప్రాణాలకు ఏదైనా అపాయం ఉందని తెలిసినా లేదా ఏదైనా ప్రాణ గండం ఉందని తెలిసినా వెంటనే వేద పండితులను కలిసి… వారి సలహా మేరకు మృత్యుంజయ హోమం జరిపిస్తుంటారు. అయితే మృత్యుంజయ హోమం చేయడం వల్ల మృత్యువు మన దరిచేరదని అనుకుంటూ ఉంటారు. అయితే అందులో నిజమెంత ఉందో చాలా మందికి తెలియదు. అయితే నిజంగానే మహా మృత్యుంజయ హోమం జరిపిస్తే…
మృత్యువు ఆగిపోతుందా లేదా అది మన భ్రమా అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.మన పురాణాల ప్రకారం.. మృత్యుంజయుడు అనగా మృత్యువుని జయించిన వాడు అని అర్థం. అయితే మనం ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుడతామో మనకు తెలియట్టే… మనం ఎప్పుడు, ఎక్కుడ, ఎలా చనిపోతామో కూడా ఎవరూ చెప్పలేరు. కానీ మనం ఎప్పుడు, ఎక్కడ ఎలా పుడతాము, చనిపోతాము అనే రెండు విషయాలు తెలిసింది ఆ భగవంతుడికి ఒక్కడే. అయితే ఈ విషయాలన్నింటిని తన వద్ద రహస్యంగా ఉంచుకునే ఆ దేవుడి కృపతో చావును దూరం చేసుకోవాలనుకుంటారు చాలా మంది. ఆ క్రమంలోనే మనకు మృత్యువును జయించే అంటే వాడు మృత్యుంజయుడు అరే పదం ఏర్పడింది. అలాగే మృత్యువుని జయించాలంటే… ఆ పరమాత్ముడిని ఆశ్రయించాలని ఈ మ-త్యుంజయ అనే పదం మనకి చెప్తోంది.
అయితే అలా మృత్యువుకి పోవలసిన వాళ్లంతా ఆ భగవంతుడిని ఆశ్రయించి చావుని తప్పించుకుంటే లయమనే కార్యక్రమం ఆగిపోతుంది. కాబట్టి మృత్యువుని జయించిన వాడనే మాటకి అర్థం ఇది కాదు. తాత్కాలికంగా మనకి చావుతో సమానంగా వచ్చి పడే ఆపదని అప మృత్యువు అంటారు. ఇలా కాకుండా మరణించే కాలంలో వచ్చిన ఆపదని మృత్యువు అంటారు. ఈ రెండింటిలోనూ మనకి తెలియకుండా వచ్చిన చావుతో సమానమైన పరిస్థితిని జయించ గల శక్తిని మనకిచ్చే వాడే మృత్యుంజయుడు అని అర్థం. అందుకే చావు సమీపిస్తున్నది అని అనిపించినపుడు మహా మృత్యుంజయ జపం, హోమం వంటివి చేయుంచుకుంటారు. అయితే అది అప మృత్యువు అయితే మన ప్రాణాలు నిలుస్తాయి. అదీ మృత్యంజయ హోమం వల్లే. కానీ మృత్యువే వస్తే మాత్రం ఎవరూ ఆపలేరు.