Nandi Vardhanam : బంగారం కంటే విలువైన గరుడ వర్ధనం మొక్క.. మీ ఇంట్లోనూ పెంచేయండి! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nandi Vardhanam : బంగారం కంటే విలువైన గరుడ వర్ధనం మొక్క.. మీ ఇంట్లోనూ పెంచేయండి!

 Authored By pavan | The Telugu News | Updated on :22 May 2022,7:00 am

Nandi Vardhanam : గరుడ వర్ధనం, నంది వర్ధనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఎందుకంటే దాదాపు ప్రతీ ఒక్క ఇంట్లో లేదా ఇంటి ముందు ఈ మొక్క కచ్చితంగా కనిపిస్తుంటుంది. మనం రోజూ పూజలో ఈ పూలను కూడా వాడుతుంటాం. అయితే కొన్ని చోట్ల ఈ మొక్కను చక్రం పూల చెట్టు అని కూడా పిలుస్తుంటారు. అయితే తెలుపు రంగుతో 5 రేఖలను కల్గి ఉండే ఈ పూవు… సువాసనలను వెదజల్లుతుంది. గరుడ వర్ధనం పూలు ఎక్కువగా శివారాధనకు వాడుతుంటారు. అయితే ఈ పూలు గరుత్మంతునికి చాలా ఇష్టమైనవి. గరుడ వర్ధన పూలతో శివారాధన చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి. అలాగే నంది వర్ధనం పూలో శివుడికి, గరుడ వర్ధనం పూలతో విష్ణువుకి పూజ చేస్తారు. దైవారాధనకే కాకుండా ఈ చెట్టు ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్గి ఉంటుంది. ఈ చెట్టు యొక్క ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. పంటి నొప్పికి ఈ చెట్టు పేర్లను, వేళ్లపై బెరడును ఉపయోగిస్తారు. నంది వర్ధనం లేదా గరుడ వర్ధనం పూలు కంటి అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్ని ఇస్తాయి. గరుడ వర్ధనం పూల రెండు తీసుకొని నీటిలో ముంచి కళ్లపై పెట్టుకొని కాసేపు రిలాక్స్ అవ్వడం వల్ల పని ఒత్తిడి తగ్గి అలసట తగ్గుతుంది.

importance of nandi vardhanam and garudava vardhanam plant

importance of nandi vardhanam and garudava vardhanam plant

కళ్లు ఎర్రబడడం, మంటలు రావడం కూడా తగ్గుతాయి. ఇలా పూలను కంటిపై పెట్టుకోవడం వల్ల సాధారణ ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈ కారణం చేతనే పల్లెటూర్లలో నంది వర్ధనం, గరుడ వర్ధనం చెట్లను ఎక్కువగా పెంచుతుంటారు. వయసు మళ్లిన వారు కూడా ఇలా చేయడం వల్ల దృష్టి లోపాలు తగ్గించి కంటి చూపను మెరుగుపరుస్తాయి. చిన్న పిల్లలు కంటి చూపు సమస్యలతో బాధ పడితే ఈ చిట్కాలు పాటించినట్లయితే కంటి చూపు బాగవుతుంది. ఈ పువ్వులను మూడు కోసి గ్లాస్ నీటిలో నాలుగు గంటల పాటు నానబెట్టి ఆ నీటితో కళ్లను కడిగినట్లయితే కంటి సమస్యలు, కళ్ల మంటలు, కళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఈ చెట్ల నుండి వచ్చే పాలను గాయాలు లేదా పుండ్ల మీద అప్లై చేస్తే గాయాలు, పుండ్లు తగ్గిపోతాయి. తలనొప్పి, కంటి నొప్పులు ఉన్నట్లయితే ఈ ఆకుల రసాన్ని తీసి కొబ్బరి నూనెలో కలిపి తన నుదురు భాగంలో రాస్తే తలనొప్పితో పాటు కంటి నొప్పులు చాలా వరకు తగ్గుతాయి.

కాళ్లపై ఉండే పుండ్లు నొప్పి తగ్గాలంటే ఆకుల రసాన్ని  అప్లై చేస్తే నొప్ప త్వరగా తగ్గుతుంది. ఈ ఆకులు అందు వేసి మరిగించి వడకట్టి చల్లారాక కళ్లు కడుక్కుంటే కళ్ల దురదలు, నొప్పులు తగ్గుతాయి. కళ్లు అంటుకున్న వారు ఈ ఆకులు వేసి మరిగించిన నీటితో కళ్లు కడుక్కుంటే కళ్లు శుభ్ర పడతాయి. ఎలుక లేదా పంది కొక్కు కరిచిన విషాన్ని పోగొట్టడానికి నంది వర్ధన బెరడు, నంది వర్ధన పువ్వులు వేసి మరిగించి నీటిని నాలుగు చెంచాల చొప్పున వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల విషం పోతుంది. అలాగే నంది వర్ధనం పూలను పేస్టుగా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు పోతాయి. అలాగే ఈ మొక్కలను ఇంటి వద్ద పెంచుకోవడం వల్ల అష్ట ఆశ్వర్యాలు కల్గుతాయి.

Also read

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది