Categories: DevotionalNews

Tulasi Chettu : తులసి చెట్టు మట్టికి ఎంతటి విశిష్టత ఉందో తెలుసా… గుమ్మం ముందు కడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం..!

Tulasi Chettu :తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఇలా చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే అప్పుల బాధలు పోయి సంపన్నులుగా మారుతారు. మరి తులసి చెట్టు కింద ఉన్న మట్టితో ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..? తులసి చెట్టు ఏ దిక్కున ఉంటే మంచి జరుగుతుంది..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి స్వయంగా మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం. శ్రీకృష్ణ పరమాత్మ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి భక్తుడయ్యాడు. తులసిని ఎన్నో విధాలుగా సుతించారు. మన సనాతన ధర్మంలో తులసి లేని ఇల్లు కళా విలీనం అని చెప్పారు. మరి అలాంటి తులసి మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి రోజు దీపం పెట్టడం మన ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం. హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానం పొందింది. తులసి మొక్క హిందువుల ఇళ్లల్లో సదా పూజనీయమైనది. కావున హిందువులు ప్రతి ఇంట తులసి మొక్కను కోటలో పూజించడం మనం గమనిస్తూ ఉంటాం. పట్టణవాసులైతే అంతస్తులలో కొంత జాగాను ఏర్పరచుకొని కుండీలలో లేదా డబ్బాలలో పెట్టి పూజిస్తూ ఉంటారు. కాబట్టి తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా సోబిల్లుతుందని అత్యంత విశ్వాసం.

తులసి కోటను చెట్టును నిత్యం భక్తిశ్రద్ధలతో పూజించాలి. అలాగే నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి. దీనివల్ల అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపం ప్రత్యాన్యాయం జరుగుతుంది. తులసి వనం ఉన్న గృహం పుణ్యతీర్ధంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం. తులసి చెట్టు మన ఇంటి ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు అని పెద్దలు చెబుతారు. నర్మద నదిని చూడడం గంగ స్నానం చేయడం తులసి వనాన్ని సేవించడం ఈ మూడు కూడా సమానమైన ఫలాలను ఇస్తాయి. ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు చాతృమాష దీక్ష కాబట్టి ఈ సమయంలో తులసి మొక్క చోటు మార్చకూడదు. తులసి మాలను ఎక్కువగా రాముడికి కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనది. బుద్ధిని మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఈ మాల ఎంతగానో ఉపయోగపడుతుంది.

Tulasi Chettu : తులసి చెట్టు మట్టికి ఎంతటి విశిష్టత ఉందో తెలుసా… గుమ్మం ముందు కడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం..!

తులసి మాలను ధరించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి. తులసి మొక్కను భూమి నుండి పెరిగేలా నాటుకోవాలి అనుకుంటే తూర్పు ఉత్తర దిశల్లో పెంచడం మంచిది. తులసి కోట కట్టుకోవాలి అనుకుంటే దక్షిణం వైపు పెట్టుకోవాలి. ఒకవేళ అపార్ట్మెంట్లో పెట్టాలి అనుకుంటే ఈశాన్యం తప్ప వేరే ఏ దిక్కునైనా పెట్టుకోవచ్చు. మరి తులసి చెట్టు కింద ఉన్న మట్టితో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.తులసి చెట్టు దగ్గర నుంచి పిడకడ మట్టి తీసుకోవాలి ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఓం తులసియాయ విజ్ఞహే.. త్రిపురారీ ఆయతీ మహి తన్నో తులసి త్రిచోదయాత్… అనే మంత్రం జపించి ఒక ఎర్రటి గుడ్డలో ఈ మట్టి కట్టి మీ ఇంటి ముందు సింహద్వారానికి కట్టండి. ఇలా మంగళవారం లేదా శుక్రవారం చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

11 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

14 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

18 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

21 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

23 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

2 days ago