Home » Devotional » In The Next Five Days There Will Be A Big Danger For Aquarius
Devotional

Aquarius : రానున్న 5 రోజులలో కుంభ రాశి వారికి భారీ ప్రమాదం..!

Authored By
aruna
The Telugu News | Published on: September 22, 2023, 7:00 am
Advertisement

Aquarius : ఐదు రోజుల్లో కుంభ రాశి వారికి భారీ ప్రమాదం అనేది జరగబోతోంది. మరి కుంభ రాశి వారికి రాబోయేటువంటి ఐదు రోజుల్లో ఎలాంటి ప్రమాదం రాబోతోంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వీలు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది విశేషాలు మనం చూద్దాం చూడండి.. ఈ కుంభ రాశి వారు ఏ చిన్న మాట అన్నా సరే వెంటనే నేర్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం అనేది కూడా వీరు తీసుకోలేరు. తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. ఇకపోతే కుంభ రాశి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతుంటారు. ఎవరిని హేళన చేసి మాట్లాడటం వీరికి అసలు నచ్చదని చెప్పుకోవాలి. ఇక కుంభ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభాలు పేరు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు.

Advertisement

సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కుంభ రాశి వారికి అదృష్టం వలన మంచి స్థితి అనేది కలుగుతుంది. శ్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. అవన్నీ కూడా మంచికి దారితీస్తాయి అని చెప్పుకోవచ్చు.. అయితే వీరు అందలమెక్కించి బలోపేతం చేసినటువంటి అసమర్ధులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్ధులుగా అవుతారు. రుణాల విషయంలో కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తి ఆధ్యాత్మిక ఉద్యోగాలపరంగా చూసుకున్నట్లయితే వీరికి అనుభవం అనేది అపారంగా ఉంటుంది. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహించేటువంటి శక్తి కూడా వీరుకుంటుంది అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి మిత్రులు కూడా శత్రువులుగా అయిపోయేటువంటి అవకాశాలే ఉంటాయి.

In the next five days, there will be a big danger for Aquarius

Advertisement

అయినప్పటికీ తమ ఆలోచనలు ఎప్పటికీ మీరు మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టువదలకుండా ఉంటుంది. అయితే ఈ కుంభ రాశి వారు ఆలయానికి వెళ్లి శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడం అనేది చేయాలి. అలాగే ప్రతి శనివారం లేదా శుక్రవారం మీరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి తులసి మాల సమర్పించి రండి. దీనివల్ల మీకు వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నిత్యం శనిదేవుని పూజించుకుంటూ ఉండాలి. సాధువులు సన్యాసులు నిరాశ్రయులు పేద పిల్లల ఎవరైనా మీకు తారసపడితే కనుక వారికి ఆహారం అందించండి. ఈ విధంగా చేయడం వలన అన్ని విధాల శుభ ఫలితాలు పొందుతారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి