Jupiter : బృహస్పతి అనుగ్ర‌హంతో ఈ రాశులకు అఖండ ధ‌న‌యోగం

 Authored By prabhas | The Telugu News | Updated on :12 May 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Jupiter : బృహస్పతి అనుగ్ర‌హంతో ఈ రాశులకు అఖండ ధ‌న‌యోగం

Jupiter : దేవతల గురువైన బృహస్పతి అనుగ్రహం ఉంటే ఆ రాశులవారి జీవితం అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి తర్వాత అత్యంత శుభాలను కలిగించేది గురుడే. సంపదను ప్రసాదిస్తూనే ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాడు. అందుకే జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటే వారి జీవితం బ్రహ్మాండంగా సాగుతుందని చెప్పొచ్చు. బృహస్పతి సంచారం 2025లో కొన్ని రాశులకు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

Jupiter : బృహస్పతి అనుగ్ర‌హంతో ఈ రాశులకు అఖండ ధ‌న‌యోగం

Jupiter : బృహస్పతి అనుగ్ర‌హంతో ఈ రాశులకు అఖండ ధ‌న‌యోగం

సింహ రాశి

వీరు ఏ రంగంలో అడుగు పెట్టినా విజయాన్ని అందుకుంటారు. అది చాలా సహజంగా జరుగుతుంటుంది. అందుకే ఈ రాశివారిని అదృష్టవంతులు అంటారు. దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.

కర్కాటక రాశి

ఈ రాశివారి సంపద భారీగా పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఆస్తులు కలిసిరావడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. బృహస్పతి అనుగ్రహం వీరికి ఎల్లప్పుడూ ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటే జీవితంలో రాణిస్తారు.

ధనుస్సు రాశి

ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతారు. ఆర్థిక ప్రయోజనాలు వీరికి చాలా మెండుగా ఉన్నాయి. ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

మీన రాశి

బృహస్పతికి ఈ రాశి అంటే చాలా ఇష్టం. వీరికి ఓర్పు చాలా ఉంటుంది. దీనివల్ల వీరు జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ. ఎదుటివారికి డబ్బులిచ్చే సమయంలో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ పని తలపెట్టినా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజిస్తే మంచి జరుగుతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి