
Kuja Dosha : ఈ రాశిలోకి కుజ సంచారం...అయితే, ఈ 5 రాశుల వారికి అన్ని కష్టాలే...?
Kuja Transit : 2025 వ సంవత్సరంలో జూలైలో 28న మొదటి సోమవారం రోజున కుజసంచారం జరిగింది. ఇది శ్రావణ మాసంలో జరిగింది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజున కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం చేత కొన్ని రాశుల వారికి అనేక కష్టాలు కలగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మార్పు కొన్ని రాశుల వారికి , వ్యాధులు, వివాదాలు మానసిక అశాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రభావం ఏ రాశుల వారిపై ఎక్కువగా ఉందో తెలుసుకుందాం. సోమవారం నుంచి కుజుడు కన్యారాశిలోనికి అడుగుపెట్టాడు. తద్వారా, ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత మరింత పెరిగింది. జులై 28 2025న కన్యారాశిలో కుజుడు ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి సవాలుగా మారింది. వృషభం, సింహం, కన్య, ధనస్సు,మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. సంచారం శని కోణంలో ఉండబోతుంది.కాబట్టి,శని,కుజుల కలయిక సంసప్తక యోగాన్ని సృష్టిస్తుంది.ఈ యోగం కొన్ని రాశుల వారికి ఉద్రిక్తత, వివాదం, గాయం,ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కుజసంచారం వల్ల ప్రతికూలంగా ప్రభావితమయ్యే రాశులకు చెందిన వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ నిపుణులు తెలియజేస్తున్నారు.
Kuja Dosha : ఈ రాశిలోకి కుజ సంచారం…అయితే, ఈ 5 రాశుల వారికి అన్ని కష్టాలే…?
కన్యా రాశిలోకి కుజుడు ప్రవేశించడంతో శనీశ్వరునితో యోగం 7వకోణం ఏర్పడబోతోంది. శనీశ్వరుడి, ముఖాముఖి కోణం సంఘర్షణ మానసిక అసమతుల్యత పనిరంగంలో అడ్డంకులకు దారితీస్తుంది.ఈ యోగంగా గ్రహాల సంఘర్షణను సూచిస్తుంది.ఇది జీవితంలో అడ్డంకులు, కోపం, అలసట పెంచుతుంది. ముఖ్యంగా, ఈ 5 రాశుల వారికి కుజసంచారం సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
వృషభ రాశి : ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు కుటుంబం కలహాలు, ఆర్థిక నష్టం కనిపిస్తాయి. నిద్ర లేకపోవడం, అలసట,సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు.అంతే కాదు, ఈ రాశికి చెందిన వారికి ఉద్యోగాలలో ఆఫీసులలో అనవసర వివాదాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపు సమస్యలు, పిల్లలకు సంబంధించిన విషయాలలో ఆందోళన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.బెల్లం పప్పుని దానం చేయండి.
ధనస్సు రాశి : ఈ రాశి వారు చేసే పనిలో ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. అనుకోని ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. అధికంగా ధనం ఖర్చవుతుంది. ముఖ్యంగా, వీరి జీవితంలో గురించి ఆందోళన పడాల్సిన అవసరం వస్తుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు క్షీణించవచ్చు. కాళ్లు లేదా తొడల్లో నొప్పులు వంటి సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పరిహారం : మంగళవారం రోజున రాగి పాత్రలో సూర్యున్ని వర్గ్యం సమర్పించండి. ఎర్రచందనంతో బొట్టు పెట్టుకోండి.
కన్యా రాశి : కుజ సంచారంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కడుపు సమస్యలు, కోపం, చిరాకు,మానసిక,అలసట వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు, మీరు ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకుంటే గందరగోళానికి గురవుతుంటారు.సంబంధంలో చీలికలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
మీన రాశి : ఈ రాశి వారికి నిద్రలేని సమస్య ఏర్పడుతుంది. అంతేకాదు, జీర్ణ సమస్యలు ఇంకా మానసిక అలసట, వెన్నునొప్పి,చర్మ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సంబంధాలలో అపార్ధాలు కూడా ఏర్పడతాయి. నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలలో గందరగోళం నెలకొంటుంది. కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి.
పరిహారం : ఓం అంగారకాయ నమః అని పఠించండి. పప్పులు దానం చేయండి…
కుజ సంచారంతో చేయాల్సిన పరిహారాలు :
. ఈ అంగారక సంచారం అనేక రాశులకు చెందిన వ్యక్తులకు ఆందోళనకమైనది. అయితే, సకాలంలో చేస్తే ప్రతికుల ప్రభావాలను నివారించవచ్చు.
. రోజు హనుమాన్ చాలీసా పటించండి ఓం భౌ మాయ నమః అనే మంత్రాన్ని జపించండి.
. మంగళ వారం రోజున ఎర్రటి దుస్తులు పప్పు రాగి పాత్రలు దానం చేయండి.
. వేడిగా, కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. పుష్కలంగా నీరు తాగాలి.
.ఇనుము లేదా పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండండి.
. కోపాన్ని మాటను నియంత్రించుకోండి, మంగళవారం ఉపవాసం ఉండండి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.