Categories: NewsTelangana

Brahmotsavams : ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు..!

Brahmotsavams  : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏదులాబాద్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. మాజీ ఎంపీటీసీ కందుల కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ జడ్పీ ఛైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, ముల్లి పావని జగ్గయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్, మాజీ కార్పొరేటర్ భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరంతా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Brahmotsavams : ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు..!

Brahmotsavams  : రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్

మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఏదులాబాద్ గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించడం ఒక గొప్ప సంప్రదాయమని, ఈ ఉత్సవాలు గ్రామస్తులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ మాట్లాడుతూ, ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవాలని, స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ధార్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

కందుల కుమార్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనను అభినందించారు. ఈ ఉత్సవాలకు గ్రామస్తులే కాకుండా, పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. రంగురంగుల పూలతో అలంకరించిన రథంపై స్వామివారు కనువిందు చేశారు. భక్తులు స్వామివారికి హారతులు సమర్పించి, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Recent Posts

Monsoon Detox Drinks : వర్షాకాలంలో ఈ డ్రింక్స్ ని తీసుకున్నట్లయితే… మీకు ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి…?

Monsoon Detox Drinks : మార్పులు సంభవిస్తే మన శరీరంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అయితే,సీజన్లను బట్టి శరీరం…

37 minutes ago

Kingdom Movie : కింగ్‌డ‌మ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత‌.. లాభాల్లోకి రావాలంటే ఎంత రాబ‌ట్టాలి?

Kingdom Movie : టాలీవుడ్‌ Tollywood లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ,  vijay devarakonda ,  bhagya…

2 hours ago

Red Food Benefits : మీరు ఎరుపు రంగులో ఉండే ఆహారాలను… ప్రతిరోజు తీసుకుంటే… బాపురే అనాల్సిందే…?

Red Food Benefits : కూరగాయలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి…

3 hours ago

Shravana Masam 2025 : శ్రావణమాసంలో స్త్రీలు ఎక్కువగా ఆకుపచ్చ చీరలు, గాజులు ఎందుకు ధరిస్తారు… శాస్త్రీయ కోణం ఏమిటి..?

Shravana Masam 2025 : మహిళలు ఎంతో ఇష్టంగా శ్రావణమాసంలో ఆధ్యాత్మిక తో భావంతో నిండి,పూజలను చేస్తూ ఉంటారు. అయితే…

4 hours ago

Asaduddin Owaisi : పాకిస్తాన్‌కు నీరు, వాణిజ్యం, విమాన సర్వీసులు నిలిపివేసినప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు : ఒవైసీ

Asaduddin Owaisi  : భారత్ vs పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా…

5 hours ago

Fertility Food : ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నాలు చేసే అలసిపోయారా… అయితే వీరి కోసమే ఈ ఆహారాలు…?

Fertility Food : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వివాహం జరిగిన తరువాత మొదట కోరిక తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు.…

6 hours ago

Prabhas Puri Jagannadh : రాజా సాబ్ సెట్‌లో ప్ర‌భాస్‌ని క‌లిసిన పూరీ.. కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడా ఏంటి..?

Prabhas Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్‌ ది టాప్ డైరెక్టర్లలో ఒకడు పూరీ జగన్నాథ్…

7 hours ago

Kuja Transit : ఈ రాశిలోకి కుజ సంచారం…అయితే, ఈ 5 రాశుల వారికి అన్ని కష్టాలే…?

Kuja Transit : 2025 వ సంవత్సరంలో జూలైలో 28న మొదటి సోమవారం రోజున కుజసంచారం జరిగింది. ఇది శ్రావణ…

8 hours ago