Lakshmi Devi : శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi : శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది… వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :24 March 2023,4:30 pm

Lakshmi Devi : శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. లేదంటే ఈ పనులు చేస్తే ఆ శని భగవానుడు పట్టిపీడిస్తాడు. కావున ఆడవారు తప్పక చేయాల్సిన పనులు ఏంటి? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవారు చేయకూడని పనులు ఏంటి.. శని కటాక్షం మన పైన ఉండటానికి శని ప్రభావం వ్యతిరేకంగా మన పైన ఉండకుండా ఉండటానికి ఎటువంటి పనులు చేయాలి. అంతే కాకుండా శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కటాక్షం మన పైన ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలి ఆడవారందరూ కూడా ఎవరైతే లక్ష్మి కటాక్షం కోరుకుంటున్నారో వాళ్లు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. సాధారణంగా లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఇష్టమైనటువంటి

Lakshmi Devi comes home only if women do not do these things on Saturday

Lakshmi Devi comes home only if women do not do these things on Saturday

దైవానికి సంబంధించి ఒక్కొక్కరు కొంతమంది ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ఇలా ఒక్కొక్క రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎటువంటి పూజలు చేసిన కూడా ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు కొన్ని పనులు శనివారం నాడు చేయకూడదు. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. వాటికి అనుగుణంగా మనం నడుచుకుంటేనే ఆ భగవంతుని ఆశీర్వాదాలు మనపై ఎప్పుడూ ఉంటాయి. సాధారణంగా కొంతమంది ఇళ్లలో అందరూ కష్టపడుతూ ఉంటారు. లేదా ఒకరిద్దరు కష్టపడిన మంచి సంపాదన ఉంటుంది. ఏదో ఒక ఇబ్బంది రావటం వల్లమనకి కూడా తెలియని కొన్ని తప్పులు చేస్తున్నాము అని అర్థం. శనివారం నాడు గనుక ఈ పనులు ఎవరైనా చేస్తుంటే శని భగవానుడు పట్టిపీడిస్తాడు.

ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అమ్మవారి ఆశీర్వాదాలు కోసం కొన్ని పనులు నిత్యం చేస్తూ ఉండాలి.శరీరం మనసు ఇల్లు ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. వ్యక్తిగత శుభ్రతకి ప్రాధాన్యతనివ్వాలి. స్త్రీలందరూ కూడా శ్రీమహాలక్ష్మి దేవిలా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలాగే శనివారం నాడు చీపురిని ఈశాన్యంలో ఉంచకూడదు. అలాగే కొంతమంది వారానికి ఒకసారి పూజ చేస్తూ ఉంటారు. అటువంటి వారు శనివారం నాడు సాయంత్రం ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం. అలాగే పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకండి.

These signs appear before Lakshmi Devi enters your home

These signs appear before Lakshmi Devi enters your home

అలాగే ధాన్యాన్ని దానంగా ఇవ్వొచ్చు. మీకు ఎప్పటికీ శ్రీమహాలక్ష్మి దేవి కటాక్షం ఉంటుంది.ఎవరు కూడా తల దిండుపై కూర్చోవడం అనేటువంటి సంస్కృతిని మర్చిపోవాలి. అలాగే శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. కొంతమంది ఆడవారు నిద్రపోయేటప్పుడు లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు. శనివారం నాడు మాత్రం ఎట్టి పరిస్థితులను అలా చేయకూడదు. ఏదైనా బాధాకర సంఘటన జరిగిందనుకోండి ప్రభావం మీ పట్ల కూడా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికీ ఇవ్వకండి. ఎవరైనా మీకు బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి. ఎందుకంటే శనివారం నాడు లక్ష్మి మాత మన గడప దాటి వెళ్ళకూడదు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది