Magha Masam : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క మాసానా ప్రతి ఒక్క తిధిలో ఒక్కొక్క మాసమున ఒక్కొక్క తిదిలో ఒక్కొక్క యోగాలు ఏర్పడతాయి. అయితే 2025 వ సంవత్సరంలో మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. తే రోజున శ్రీమహావిష్ణువుని పూజిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ఏకాదశి నాడు జయవ్రతం చేయడం వల్ల వ్యక్తిలో పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు.
జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉపవాసము అంటే ఆహారం తీసుకోకుండా కేవలం నీరు మాత్రమే తీసుకోవడం. అయితే,కొంతమంది ఫలాలు, పాలు తీసుకుంటూ ఉంటారు. విజయ ఏకాదశి రోజున విష్ణువును పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామం వంటిది సోత్రాలను కూడా పఠించాలి. రాత్రి సమయంలో జాగరణ చేసి భజనలు,కీర్తనలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
ఏకాదశి 2025 ఫిబ్రవరి 8న శనివారం జరుగుతుంది. ఈ ఏకాదశి మాఘమాసం, శుక్లపక్ష ఏకాదశికి చెందుతుంది.
.ఏకాదశి తిధి ప్రారంభం : ఫిబ్రవరి 7, 2025, రాత్రి 09:26 pm.
. ఏకాదశి తిధి ముగింపు : ఫిబ్రవరి8,2025, రాత్రి08:15.
పారణ సమయం : ఫిబ్రవరి 9, 2025, ఉదయం 07:04, నుండి 09:17 am మధ్య.
జయ ఏకాదశి మహత్యం : ఈ జయ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుని పూజించుట వలన ఆ పాపాలన్నీ తొలగిపోయి చేసిన పాపముల నుoడి విముక్తి లభించడంతోపాటు వైకుంఠానికి సరాసరి ప్రవేశానికి సాధ్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పరమ దినమున మహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో ఇస్తూ ఉపవాస దీక్షలను చేయడం ద్వారా అత్యంత ఫలప్రదం అని చెబుతున్నారు. మహా విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలన్న మరియు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి అంటే జయ ఏకాదశి నాడు శ్రద్ధలతో ఉపవాస దీక్షను ఆచరించి పూజిస్తే పాపాలన్ని తొలగిపోతాయి. అని భక్తుల యొక్క నమ్మకం.
జయ ఏకాదశి పురాణం కథ : పూర్వకాలంలో, ఉత్తరావతీ అనే నగరంలో దేవదత్తుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు జయ మరియు విజయ అనే ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. జయ చాలా అందంగా ఉండేది మరియు ఆమెను లక్ష్మీదేవిగా భావించేవారు. ఒకానొక రోజున, జయ తన స్నేహితులతో కలిసి నది ఒడ్డున విహరిస్తుండగా, అక్కడకు వచ్చిన గంధరుడు ఆమెను చూసి మోహితుడయ్యాడు. ఆమెను అతడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఆమెను అక్కడి నుంచి తనతో తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తాడు. కానీ జయ అతన్ని ప్రతిఘటించింది. ఆమె తండ్రి తో ఈ విషయం చెప్పింది. రాజు గందరుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. జయ తన తండ్రికి జరిగిన విషయం గురించి చెప్పింది. తక్షణమే శిక్షించాలని కోరింది. అయితే రాజు గందరుడిని బంధించి కారాగారాలలో వేశాడు. అయితే జయకు గందరుడిపై జాలి కలిగింది. ఆమె తన తండ్రిని అతనిని విడుదల చేయమని తిరిగి వేడుకుంది. రాజు ఆమె మాట విని గందరుడిని విడుదల చేశాడు. అయితే, గంధర్వుడు జయను వివాహం చేసుకుంటాను అని వాగ్దానం చేశాడు. ఆమెను తనతో తీసుకువెళ్లాడు.
కొంతకాలం తర్వాత, జయ, గంధర్వులకు ఒక కుమారుడు కు జన్మనిచ్చారు. ఇలా వారు సంతోషంగా జీవిస్తుండగా… ఒకరోజు, తన భర్తతో కలిసి విష్ణువును పూజించాలని వైకుంఠానికి వెళ్ళింది. అక్కడ జయ శ్రీమహావిష్ణువును చూసి చాలా సంతోషించింది. జయ విష్ణువుని తన భర్తతో కలిసి తమ ఇంటికి రావాలని ఆహ్వానించింది. శ్రీ మహావిష్ణువు ఆమె ఆహ్వానాన్ని స్వీకరించాడు. వారి ఇంటికి వచ్చాడు.
జయ, గంధర్వుడు శ్రీమహావిష్ణువు ఎంతో భక్తితో సేవించారు. ఈ మహావిష్ణువు వీరి ఇరువురి భక్తుని మెచ్చి వారికి మోక్షం ప్రసాదించాడు. ఏకాదశి వ్రతం చేయడం వల్ల జయకు ఈ పుణ్యం లభించింది. కావున భక్తిశ్రద్ధలతో మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో 8వ తారీఖున వచ్చే జయ ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువుని మరియు లక్ష్మీదేవిని కలిపి పూజించుటవలన , సారాసారీ వైకుంఠ లోకానికి, మీ పాపాలను తొలగించుకోనుటకు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో తప్పక పుణ్యం లభిస్తుంది. అని పురాణ గాథలు చెబుతున్నాయి.
Dry Fruit : కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలకు హెల్త్ టిప్స్ ని పాటించడం అలవాటుగా మారిపోయింది. ఇంట్లో ఈజీ…
Etela Rajender : తనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ KCR Phone ఫోన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి BJP…
PM Kisan : భారతీయ రైతులకు శుభవార్త. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్ సమ్మాన్…
Cinnamon water Benefits : ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరికీ అందుబాటులో ఉండే ఈ దాల్చిన చెక్క గురించి…
Canara Bank Recruitment : బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలలు కంటున్న యువతకు ఒక ముఖ్యమైన వార్త. కెనరా…
Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మంచి జోష్ మీదుంది. రీసెంట్ గా…
Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) Working Journalists మేడిపల్లి మండల Medipally అడహాక్ కమిటీ…
Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు నాగ చైతన్య…
This website uses cookies.