Maha Shivaratri : మార్చి 8 మహాశివరాత్రి లోపు ఈ కథను వింటే చాలు… కోటి జన్మలకు పుణ్యం కలుగుతుంది…!
ప్రధానాంశాలు:
Maha Shivaratri : మార్చి 8 మహాశివరాత్రి లోపు ఈ కథను వింటే చాలు... కోటి జన్మలకు పుణ్యం కలుగుతుంది...!
Maha Shivaratri : ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుని అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూతి ధారణలో జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశాము. అన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తి రీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతనికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురుచూసిన కానీ ఫలితం దొరకకపోవటంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే దాన్ని సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. అతనికి ఊతపదంగా శివ శివ అనటం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు విరుస్తున్నాడు.
ఇంతలో అటుగాఓ జింక వచ్చింది మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేసాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక జింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతను భావించగా తను బక్క పల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం యొక్క ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరికాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకొంది. మొదటి జంతువు కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు. తన ప్రాప్తం దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతనికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిదామని అనుకునేంతలో ఆ మగజంగా కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడ జింకలు ఇటుగా వచ్చాయా అని అడిగింది. ఆ మగ జింక వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగ జింకకు చెప్పాడు. ఇక సూర్యోదయం అయ్యింది.
తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అడ్డుగా రావటం గమనించాడు. తన పిల్లలు ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటివరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది. మరి కొద్ది సేపటికి 4 జింకలు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ప్రవర్తన వేటగాడిలో మార్పులు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతను కూర్చుంది మారేడు చెట్టు కావడం అతనికి తెలియకుండానే శివనామ స్మరణ చేయటం తన చూపులకు అడ్డువచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడవేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. అలాగే ఆహారం దొరకక ఆ రోజంతా కూడా అతడు ఉపవాసం చేశాడు. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజ ఫలం వల్ల అతను హింసను విడనాడాడు.శివుడు యొక్క అనుగ్రహం పొంది మృగశిరా నక్షత్రం గా మారాయి వేటగాడు. ఆ నక్షత్రానికి వెనక ఉజ్వలంగా ప్రకాశిస్తూ నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. ఆ మహాశివరాత్రి వేటగానిలో అంతటి మార్పులు తీసుకుని వచ్చింది. పరమ పవిత్రమైనటువంటి ఆ మహాశివరాత్రి రోజు తెలుసి కానీ తెలియక కానీ ఈ పుణ్య కార్యాలు ఎవరైతే చేస్తారో వారికి శివ అనుగ్రహం లభిస్తుంది…