Maha Shivratri : శివుడు ఎలా జన్మించాడో తెలుసా ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Maha Shivratri : శివుడు ఎలా జన్మించాడో తెలుసా ..?

Maha Shivratri : శివ పురాణం ప్రకారం శివుడు స్వయంభు. ఆయన స్వయంగా జన్మించాడు. ఒకానొక సమయంలో శూన్యం నుండి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తే సదాశివుడు. సైన్స్ కూడా ఇదే చెబుతుంది మనకు తెలిసిన బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విశ్వంలో మొదట ఏమీ లేదు. అంతా శూన్యంగా ఉండేది. అలా ఉన్న సమయంలో శూన్యం నుండి ఒక బిందువు ఉద్భవించింది. అలా పుట్టిన బిందువులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంలో ఈ సృష్టి అనేది […]

 Authored By tech | The Telugu News | Updated on :8 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Maha Shivratri : శివుడు ఎలా జన్మించాడో తెలుసా ..?

Maha Shivratri : శివ పురాణం ప్రకారం శివుడు స్వయంభు. ఆయన స్వయంగా జన్మించాడు. ఒకానొక సమయంలో శూన్యం నుండి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తే సదాశివుడు. సైన్స్ కూడా ఇదే చెబుతుంది మనకు తెలిసిన బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విశ్వంలో మొదట ఏమీ లేదు. అంతా శూన్యంగా ఉండేది. అలా ఉన్న సమయంలో శూన్యం నుండి ఒక బిందువు ఉద్భవించింది. అలా పుట్టిన బిందువులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంలో ఈ సృష్టి అనేది ఆవిర్భవించింది. అలా బిందువు నుండి స్వయంగా ఉద్భవించిన మహాశక్తి సదాశివుడు. ఇతడికి ఆది అంతాలు లేవు. పంచభూతాలను ఆయన ఆధీనంలోనే ఉంటాయి. ఇక హైందవ సాంప్రదాయంలో దేవుళ్లందరిని విగ్రహా రూపంలో పూజిస్తారు. కానీ శివుడిని లింగ రూపంలో పూజిస్తారు. అయితే సృష్టి రచన జరుగుతున్న సమయంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువులిద్దరూ వాదులాడుకోవడం మొదలుపెట్టారు. వీరిద్దరి మధ్య గొడవ పెద్దది అవ్వడంతో ఇరువురి మధ్య సదాశివుడు భారీ అగ్ని స్తంభ రూపంలో ఉద్భవిస్తాడు. అగ్నిని వెదజల్లుతూ భారీ లింగ రూపంలో ఉన్న సదాశివుడు బ్రహ్మ విష్ణువులతో మీరిద్దరూ ఈ అగ్నిస్తంభం ఆది, అంతం కనుగొనుండి అని, ఎవరు కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని చెబుతాడు.

దీంతో బ్రహ్మ విష్ణువులు అగ్నిస్తంభం ఆది, అంతం కనుక్కోవడానికి వెళతారు. బ్రహ్మ అగ్నిస్తంభం చివర కనుక్కోవడానికి వెళ్లగా విష్ణు అగ్నిస్తంభం మొదలు కనుక్కోవడానికి కిందికి వెళతాడు. అలా వీరి ప్రయాణం యుగాల పాటు సాగుతుంది. విష్ణువు ఈ స్తంభం యొక్క ఆది , అంతాలను కనుక్కోవడం అసాధ్యమని గ్రహించి తన ఓటమి అంగీకరించి మొదటికి వచ్చేస్తాడు కానీ బ్రహ్మ అహంభావంతో ఓటమి ఒప్పుకోవడం ఇష్టం లేక తాను ఈ అగ్నిస్తంభం యొక్క మొదలు కనుక్కున్నానని దానికి మొగలిపువ్వే సాక్ష్యం అని సదాశివుడితో అబద్ధం చెబుతాడు. జరిగిందంతా గ్రహించిన పరమేశ్వరుడు ఆగ్రహించి బ్రహ్మతో నీవు అబద్ధం తో గెలవాలి అనుకున్నావా ఇక శిక్ష అనుభవించక తప్పదు. నీకు ముల్లోకాలలో ఎలాంటి పూజలు జరగవని శపిస్తాడు. అలాగే బ్రహ్మ కోసం అబద్ధం ఆడిన మొగలి పువ్వును కూడా నువ్వు పూజకు పనికిరావు అని శపిస్తాడు. బ్రహ్మ, విష్ణువుల గర్వం అణచడానికి శివుడు ఆ సమయంలో అలా లింగ రూపం దాల్చాడు. దీనినే లింగోద్భావం అని పిలుస్తారు.

లింగ రూపంలో ఉన్న సదాశివుడు తానే బ్రహ్మాను, తానే విష్ణువునని తనలో ఉండే ఉద్భవించాయని సృష్టి రహస్యాన్ని ఇద్దరికీ చెబుతాడు. తన తప్పు తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు తమ ని క్షమించమని శివుడిని ఒక రూపం ధరించమని చెబుతారు. అప్పుడు శివుడు లింగాకారంలోకి మారుతాడు. తరువాత రుద్రుడిగా మహాశివుడిగా రూపాంతరం చెంది లయ కారకూడిగా తన కర్తవ్యాన్ని చేయడం ప్రారంభిస్తాడు. మరొక కథ ప్రకారం ఈ సృష్టిలో ఆదిపరాశక్తి ఉద్భవించింది. ఆమెకు ఈ సృష్టి రచన చేయాలని సంకల్పం కలగడంతో తనకు సహాయకారులు ముగ్గురు పురుషులను సృష్టించింది. వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అలా ఆవిర్భవించిన ముగ్గురిని చూసి మోహించిన ఆమె మీలో ఒకరు నన్ను వివాహం చేసుకోవాలని అంటుంది. తమని సృష్టించిన ఆదిపరాశక్తిని వివాహం చేసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు నిరాకరించిన శివుడు కొంచెం ఆలోచించి ఆదిపరాశక్తితో నిన్ను పెళ్లి చేసుకోవడానికి సమ్మతమే కానీ నీ మూడో నేత్రాన్ని నాకు ఇవ్వాలని అడుగుతాడు. దీనికి సరే అని ఆమె మూడో నేత్రాన్ని శివుడికి ఇస్తుంది. దీంతో శివుడు మూడో నేత్రం తెరిచి ఆమెను భస్మం చేస్తాడు. ఆ బస్మరాశిని మూడు భాగాలుగా చేసిన శివుడు ఒకటో భాగాన్ని పార్వతీగా, రెండో భాగాన్ని లక్ష్మిగా, మూడో భాగాన్ని సరస్వతిగా జన్మించమని ఆదేశిస్తాడు. అలా త్రిమూర్తులు ఆదిపరాశక్తి అంశ అయినా లక్ష్మీ , సరస్వతి, పార్వతీలతో వివాహం అవుతుంది.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది