Today Gold Rate 15 February 2026 : మహాశివరాత్రి పర్వదినాన షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

 Authored By sudheer | The Telugu News | Updated on :15 February 2026,10:06 am

ప్రధానాంశాలు:

  •  Today Gold Rate 15 February 2026 : మహాశివరాత్రి పర్వదినాన షాక్ ఇచ్చిన బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

Today Gold Rate 15 February 2026 : మహాశివరాత్రి Maha Shivratri పర్వదినాన బంగారం ధరలు కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇచ్చాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు, పండగ పూట ఒక్కసారిగా భారీగా పెరగడం గమనార్హం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, వివాహాల సీజన్ డిమాండ్ కారణంగానే ఈ స్థాయిలో ధరలు ఎగబాకినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భక్తులంతా శివనామస్మరణలో మునిగిపోయిన వేళ, బులియన్ మార్కెట్లో ఈ ‘ధరల మంట’ సామాన్యులకు భారంగా మారింది.

Today Gold Rate 15 February 2026 : మహాశివరాత్రి పర్వదినాన షాక్ ఇచ్చిన బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

Today Gold Rate 15 February 2026 : మహాశివరాత్రి పర్వదినాన షాక్ ఇచ్చిన బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

Today Gold Rate 15 February 2026 హైదరాబాద్ లో ధరల వివరాలు

హైదరాబాద్ మార్కెట్ Hyderabad Market Gold విషయానికి వస్తే, 24 cerate  24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ. 1,970 పెరిగింది. దీనివల్ల తులం బంగారం ధర రూ. 1,57,750 మార్కుకు చేరుకుంది. అదేవిధంగా, ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులంపై రూ. 1,800 మేర పెరిగి, రూ. 1,44,600 వద్ద స్థిరపడింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడం పట్ల అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వెండి ధరల్లో ఊరట

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, వెండి ధరలు మాత్రం వినియోగదారులకు కొంత ఊరటనిస్తున్నాయి. క్రితం రోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ. 20,000 మేర తగ్గడం విశేషం. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,80,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పసిడి ధరలు పెరిగినప్పటికీ, వెండి ధరల్లో స్థిరత్వం ఉండటం వల్ల వెండి వస్తువులు మరియు వెండి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి