
Hidimbi Story : భీముడి భార్య హిడింబి కథ తెలుసా... పాండవుల గెలుపు కోసం ఎవరు చేయని త్యాగాలు చేసింది....!
Hidimbi Story : మహాభారతం అంటే గొప్ప గొప్ప వీరులే కాదు వీరవనితులు కూడా ఉంటారు .వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రభావితం చేశారు. అయితే ఈ యుద్ధంతో గాని యుద్ధ ఫలితంతో గాని సంబంధం లేకపోయినా కేవలం ఒకే ఒక మహిళ మాత్రం తన వారసత్వాన్ని మొత్తం పణంగా పెట్టి పాండవుల విజయానికి కారణం అయింది. రాజ వైభోగాలు ఉన్నా కానీ దాన్ని ఎప్పుడు కోరుకోలేదు.ఒక సాధారణ మహిళగానే జీవనాన్ని సాగించింది. రాక్షస వంశంలో పుట్టిన సరే చివరికి దేవతగా మారి ఆరాధించబడింది. అసలు ఆమె ఎవరు మహాభారతంలో ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేక పాత్ర ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఆమెనే హిడింబి. ఆమెకి పల్లవి అనే మరో పేరు కూడా ఉంది.ఈమె పాండవులో రెండవ వాడైన భీముడి యొక్క భార్య అని మనందరికీ తెలిసిందే. అయితే దుర్యోధనుడు దురాలోచన కపట బుద్ధితో పాండవులను అంతముందించాలని ఒక పథకాన్ని పన్నుతాడు.దాని ప్రకారం వారణావతం అనే ప్రాంతంలో ఉన్న ఒక లక్క ఇంటిలో పాండవులు నివసించేలా చేస్తాడు.ఆ లక్క ఇంటిని లక్క మట్టి నెయ్యి మిశ్రమంతో నిర్మించేలా చేస్తాడు. తద్వారా మంట వెలిగిస్తే వెంటనే లక్క మొత్తం కాలిపోతుంది. హస్తనిలో దుర్యోధుడిని కుట్రను తెలుసుకున్న విధురుడు అసలు విషయం పాండవులకు తెలిసేలా చేస్తాడు.దీనితో భీముడు లక్క గుండా ఒక స్వరంగ మార్గాన్ని తవ్వి ఉంచుతాడు. ఊహించినట్టే ఒక రోజు పాండవులందరూ నిద్రిస్తున్న సమయంలో ఆ లక్క ఇంటిని తగలబెడతారు.దాంతో భీముడు తన తల్లి మరియు సోదరులను ఆ స్వరంగ మార్గం ద్వారా ఒక అడవిలోకి తీసుకెళ్లి అక్కడ పడుకోబెడతాడు.
అయితే ఆ అడవిలో హిడింబా హిడింబి అనే భయంకరమైన రాక్షసులు నివసిస్తూ ఉంటారు. పాండవులు అడవిలోకి రావడంతో మనుషుల ఉనికిని పసిగడతారు ఆ రాక్షసులు. వెంటనే హిడింబా తన సోదరిని పిలిచి వారిని తన ఉచ్చులోకి లాగమని చెబుతాడు. దాని ద్వారా వాళ్ళందరినీ చంపి తినవచ్చని తద్వారా వారి ఆకలి తీరుతుందని చెబుతాడు. ఆ తరువాత హిడింబి సరస్సు వద్దకు వెళుతుంది. పాండవుల యొక్క అందమైన రూపాన్ని, ప్రకాశాన్ని చూసి ఆశ్చర్యపోతుంది.అక్కడ భీముడిని చూసి అతని ప్రేమలో పడిపోతుంది. తన అన్న నుండి భీమున్ని ఎలాగైనా రక్షించుకోవాలని హిడింబి చూస్తుంది. ఈ క్రమంలోనే హిడింబి ఒక అందమైన యువతిగా మారి భీముడు దగ్గరికి వెళ్తుంది. భీముడిని నిద్ర లేపి తన గురించి వివరంగా చెబుతుంది.
తన సోదరుడు మీ అందరిని చంపాలి అని చూస్తున్నాడని చెప్పి ఇలాగే తన ప్రేమను వ్యక్తపరిచి తనని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. ఇంతలోనే హిడింబా అక్కడికి చేరుకోవడంతో భీముడి తో యుద్ధం చేస్తాడు.ఆ యుద్ధంలో హిడింబా చనిపోతాడు ఆ తర్వాత హిడింబి దగ్గరకు వెళ్లి తనని క్షమాపణ అడిగి తనను తన తల్లి దగ్గరకు తీసుకెళ్తాడు. భీముడు తల్లి వారిద్దరికీ వివాహం జరిపిస్తుంది. హిడింబికి ఒక కొడుకు పుడతాడు. అతడే ఘటోత్కజుడు. తండ్రికి తగ్గ కొడుకుగా ఘటోత్కజుడిని తీర్చి దిద్దుతుంది హిడింబి .అలాగే పాండవులకు ఏదైనా కష్ట కాలం వచ్చినప్పుడు తన కుమారుడ్ని పంపి వారికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఘటోత్కజుడుకి ఓ రాక్షస కన్యతో పెళ్లి కూడా చేస్తుంది హిడింబి. ఇక ఆ దంపతులకు గాను బార్బరికుడు జన్మిస్తాడు. బార్బరికుడు కూడా ఎంతో గొప్ప వీరుడు.
Hidimbi Story : భీముడి భార్య హిడింబి కథ తెలుసా… పాండవుల గెలుపు కోసం ఎవరు చేయని త్యాగాలు చేసింది….!
ఇదే సమయంలో భీముడు నుండి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనేందుకు ఘటోత్కజుడికి పిలుపు రాగా తన కుమారుడితో కలిసి ఘటోత్కజుడు యుద్ధరంగంలో పాల్గొంటాడు. అయితే ఈ యుద్ధంలో బార్బరీకుడు కేవలం మూడు బాణాలతో అక్కడున్న వారందరినీ చంపేయగల శక్తిమంతుడు. అలాంటి వ్యక్తి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటే , పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉందని గ్రహించిన శ్రీకృష్ణుడు అతని తల ఇవ్వమని కోరుతాడు. అదేవిధంగా ఘటోత్కజుడు కూడా ఎంతోమంది శత్రు సైన్యాన్ని చంపి చివరికి మరణిస్తాడు. ఇలా ధర్మం కోసం హిడింబి తన కొడుకుని మనువడిని ఒకేరోజు యుద్ధరంగానికి సమర్పించింది. ఈ రకంగా హిడింబి త్యాగం మహాభారతంలో అందరికంటే గొప్పగా నిలిచింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.