
Simha Rasi : సింహరాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే అంతే సంగతులు... తస్మాత్ జాగ్రత్త...!
Simha Rasi : సింహ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి…? అలాగే మీరు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు…? ఏ లగ్నం వారిని వివాహం చేసుకోవాలి. ఏ లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహ రాశి వారికి సరైన సమయంలో వివాహం చేయకపోతే 40 సంవత్సరాల వరకు వివాహం జరగదు. ఎందుకంటే వీరి ఆలోచన విధానం జీవితంలో సెటిల్ అయినాక అన్ని సంపాదించిన తర్వాత వివాహం చేసుకోవాలని అనుకుంటారు. సింహ రాశి వారు వారి జాతకం చూపించుకొని ఎప్పుడు వివాహ గడియలు ఉన్నాయో చూసుకొని ఆ నెలలో వారు వివాహం చేసుకోవాలి. వివాహ సమయ గడియలు ఉన్నప్పుడే వీరు వివాహం చేసుకోవడం మంచిది. లేకపోతే వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అబ్బాయిలకి 25 లోపు వివాహం చేయకపోతే 40 సంవత్సరాలు దాటిన తరువాత వివాహం జరుగుతుంది. అలాగే సింహరాశి అమ్మాయిలకి మాత్రం వివాహం జరుగుతుంది.
సింహరాశి అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానం. వీరు వివాహం చేసుకున్న అత్తగారి ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్న అర్థం చేసుకునే తత్వం ఉన్నవారు. అర్థం చేసుకుని ముందుకు వెళ్లే తత్వం సింహ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటే సింహ రాశి వారు కర్కాటక రాశిని మరియు కన్య రాశి వారిని అసలు వివాహం చేసుకోకూడదు. అలాగే కర్కాటక లగ్నాన్ని కన్యా లగ్నాన్ని చేసుకోకూడదు. జాతకాలు అన్ని కలిసిన సరే మనస్తత్వాలు కలిసిన సరే వీరు వివాహం చేసుకోకూడదు. సింహ లగ్నానికి కర్కాటక లగ్నానికి జాతకరీత్యా అస్సలు పడదు. ఒకవేళ చేసుకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లైఫ్ సెటిల్ అవ్వకపోవడం ఒకరు బాగా ముందుకు వెళ్తారు మరొకరు వెనుక పడతారు. అలాగే సింహ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి అంటే వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు.
వీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలరు.మరియు ధనస్సు రాశి వారిని మరియు కుంభ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. ఏ విషయంలోనైనా వీరి ఆలోచన విధానం బాగుంటుంది. మిగతా రాశుల వారిని చేసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సింహరాశి జాతకుల ఆరోగ్య విషయానికి వస్తే వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సింహరాశి జాతకులు ఎక్కువగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మరియు వెన్నుముక సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికోసం వీరు ప్రతి పౌర్ణమి కి అరుణ పారాయణం చేయించి ఆ తీర్థం తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే పెళ్లయిన సింహ రాశి వారు జీవితంలో సెటిల్ కాని వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.
Simha Rasi : సింహరాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే అంతే సంగతులు… తస్మాత్ జాగ్రత్త…!
సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. కాబట్టి వీరు సూర్య నమస్కారం సూర్యరాధన చేయడం మంచిది. దీని వలన కెరియర్ సెటిల్మెంట్ జరుగుతుంది. ఆదిత్య హృదయం చదవడం మరియు ప్రతి ఆదివారం నవగ్రహ ప్రదక్షిణాలు మరియు శివుని ప్రదక్షిణాలు వంటివి చెయ్యాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.