Simha Rasi : సింహరాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే అంతే సంగతులు… తస్మాత్ జాగ్రత్త…!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: July 20, 2024, 9:00 am
  •  Simha Rasi : సింహరాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే అంతే సంగతులు... తస్మాత్ జాగ్రత్త...!

Simha Rasi : సింహ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి…? అలాగే మీరు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు…? ఏ లగ్నం వారిని వివాహం చేసుకోవాలి. ఏ లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహ రాశి వారికి సరైన సమయంలో వివాహం చేయకపోతే 40 సంవత్సరాల వరకు వివాహం జరగదు. ఎందుకంటే వీరి ఆలోచన విధానం జీవితంలో సెటిల్ అయినాక అన్ని సంపాదించిన తర్వాత వివాహం చేసుకోవాలని అనుకుంటారు. సింహ రాశి వారు వారి జాతకం చూపించుకొని ఎప్పుడు వివాహ గడియలు ఉన్నాయో చూసుకొని ఆ నెలలో వారు వివాహం చేసుకోవాలి. వివాహ సమయ గడియలు ఉన్నప్పుడే వీరు వివాహం చేసుకోవడం మంచిది. లేకపోతే వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అబ్బాయిలకి 25 లోపు వివాహం చేయకపోతే 40 సంవత్సరాలు దాటిన తరువాత వివాహం జరుగుతుంది. అలాగే సింహరాశి అమ్మాయిలకి మాత్రం వివాహం జరుగుతుంది.

సింహరాశి అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానం. వీరు వివాహం చేసుకున్న అత్తగారి ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్న అర్థం చేసుకునే తత్వం ఉన్నవారు. అర్థం చేసుకుని ముందుకు వెళ్లే తత్వం సింహ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటే సింహ రాశి వారు కర్కాటక రాశిని మరియు కన్య రాశి వారిని అసలు వివాహం చేసుకోకూడదు. అలాగే కర్కాటక లగ్నాన్ని కన్యా లగ్నాన్ని చేసుకోకూడదు. జాతకాలు అన్ని కలిసిన సరే మనస్తత్వాలు కలిసిన సరే వీరు వివాహం చేసుకోకూడదు. సింహ లగ్నానికి కర్కాటక లగ్నానికి జాతకరీత్యా అస్సలు పడదు. ఒకవేళ చేసుకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లైఫ్ సెటిల్ అవ్వకపోవడం ఒకరు బాగా ముందుకు వెళ్తారు మరొకరు వెనుక పడతారు. అలాగే సింహ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి అంటే వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు.

వీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలరు.మరియు ధనస్సు రాశి వారిని మరియు కుంభ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. ఏ విషయంలోనైనా వీరి ఆలోచన విధానం బాగుంటుంది. మిగతా రాశుల వారిని చేసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సింహరాశి జాతకుల ఆరోగ్య విషయానికి వస్తే వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సింహరాశి జాతకులు ఎక్కువగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మరియు వెన్నుముక సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికోసం వీరు ప్రతి పౌర్ణమి కి అరుణ పారాయణం చేయించి ఆ తీర్థం తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే పెళ్లయిన సింహ రాశి వారు జీవితంలో సెటిల్ కాని వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

Simha Rasi : సింహరాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే అంతే సంగతులు... తస్మాత్ జాగ్రత్త...!

Simha Rasi : సింహరాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే అంతే సంగతులు… తస్మాత్ జాగ్రత్త…!

Simha Rasi  పరిహారాలు

సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. కాబట్టి వీరు సూర్య నమస్కారం సూర్యరాధన చేయడం మంచిది. దీని వలన కెరియర్ సెటిల్మెంట్ జరుగుతుంది. ఆదిత్య హృదయం చదవడం మరియు ప్రతి ఆదివారం నవగ్రహ ప్రదక్షిణాలు మరియు శివుని ప్రదక్షిణాలు వంటివి చెయ్యాలి.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Today Horoscope : 23 నవంబర్ 2026 సోమ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు.. ఈ రాశులకు ధనలాభం..!"

  2. "Samsung Galaxy S25 Ultra : అబ్బా ఏం ఆఫర్.. రూ.1.30 లక్షల ఫోన్ రూ.50 వేలకే?.. ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్..!"

  3. "Gold Price Crash : బంగారం ధరలు భారీగా తగ్గినా కొనడానికి వెనుకడుగు.. అసలు 5 కారణాలు ఇవే!"

  4. "8th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు డబుల్ గుడ్‌న్యూస్ ? రూ.18 వేల జీతం రూ.65 వేలకు వ‌ర‌కు పెరిగే చాన్స్‌?"

  5. "Peerzadiguda Pulse Polio : పీర్జాదిగూడలో పోలియో చుక్కలు .. ప్రతి చిన్నారికి రక్షణ కల్పించాలి: తవిటి ప్రశాంత్ కుమార్"

  6. "IND A vs PAK A : పాక్ బ్యాటర్‌తో హర్షిత్ రాణా మాటల యుద్ధం.. మైదానంలో హైడ్రామా!"

  7. "Chengicherla Indiramma Illu : చెంగిచెర్ల ఎస్సీ బస్తీలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం.. తోటకూర అజయ్ యాదవ్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp