Mars Transit : సింహరాశిలోకి కుజుడు… మొత్తం 12 రాశులపై ప్రభావం.. పరిహారాలు తెలుసుకోవాలి, లేదంటే…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 8 June 2025, 6:00 am
  •  Mars Transit : సింహరాశిలోకి కుజుడు... మొత్తం 12 రాశులపై ప్రభావం.. పరిహారాలు తెలుసుకోవాలి, లేదంటే...?

Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలియజేస్తారు పండితులు. గ్రహాలు మార్పులు సంభవించినప్పుడు రాశులపై ఎటువంటి ప్రభావం కలుగుతుంది. వృత్తి,ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి. ఈ విషయంపై క్లుప్తంగా వివరణ ఇచ్చారు పండితులు. అయితే, సింహరాశిలోనికి కుజుడు ప్రవేశించుట చేత, 12 రాశుల వారి పైన యొక్క ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు పేర్కొన్నారు. కుజసంచారం వలన కొన్ని రాశుల వారికి కొన్ని పరిహారాలు తప్పక తీసుకోవాలి అంటున్నారు. తగిన పరిహారాలు తప్పక చేయాల్సి ఉంటుంది. కొన్ని రాశుల వారు కుజుని సంచారంతో అపార లాభాలను పొందబోతున్నారు. నవగ్రహాలులలో కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శౌర్యం, శక్తికి చిహ్నంగా భావిస్తారు. అయితే, కుజుడు సింహరాశిలోకి సంచారం చేశాడు. కుజుడు సంచారం జూన్ 7వ తేదీ 2025న తెల్లవారుజామున రెండు గంటల పది నిమిషాలు లో అడుగు పెట్టాడు. రాశిలో జులై 28 వరకు కొనసాగుతాడు. ఇలాంటి సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావం చూపుతుంది. అంతేకాదు జాతకంలో ప్రత్యేక గృహాలను ప్రభావితం చేస్తుంది. తాత్కాలికంగా మంగలిక యోగాను కూడా సక్రీయం చేస్తుంది. వివాహం కావాలని అనుకునే వారికి లేదా ఇప్పటికే వివాహం చేసుకున్నా కానీ మీ భాగస్వామి జాతకంలో కుజగ్రహ స్థానాన్ని కచ్చితంగా తెలుసుకొని ఉండాలి. కుజుని సంచారం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. నివారించుటకు ఎలాంటి పరిహారాలు చేయాల్సి వస్తుంది. 12 రాశులపై కుజుని ప్రభావం ఉండబోతుంది అనే విషయంపై తెలుసుకుందాం…

Mars Transit : సింహరాశిలోకి కుజుడు... మొత్తం 12 రాశులపై ప్రభావం.. పరిహారాలు తెలుసుకోవాలి, లేదంటే...?

Mars Transit : సింహరాశిలోకి కుజుడు… మొత్తం 12 రాశులపై ప్రభావం.. పరిహారాలు తెలుసుకోవాలి, లేదంటే…?

Mars Transit మేష రాశి

మేష రాశిలో కుజుడు 5 ఇంట్లో ఉంటాడు. ఇల్లు,పిల్లలు, తెలివితేటలు, ప్రేమకు సంబంధించిన విషయాలు. ఈ రాశి వారు పూజ సంచారం వలన పిల్లలు ఆనందాన్ని పొందుతారు. మేధో వికాసం జరుగుతుంది. వైవాహిక జీవితం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. పరిహారం: నిద్రించే సమయంలో మీ తల దగ్గర నీటిని ఉంచడం మంచిది.చిన్న పిల్లలకైతే పాలు ఇవ్వండి.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఆస్తి, తల్లికి సంబంధించిన 4 వ ఇంట్లోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి, గృహం,వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి వారి కోరిక ఫలిస్తుంది. తాత్కాలికమైన మంగళ దోషం కూడా ఈ వృషభ రాశి వారికి ఏర్పడుతుంది. పరిహారం : ఉదయం నిద్రలేచిన తర్వాత మర్రి చెట్టుకి తీపి పాలు సమర్పించండి.

మిధున రాశి : మిధున రాశికి కుజుడు 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వీరికి ధైర్యాన్ని తోబట్టువులతో సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మీరు శక్తితో నిండి ఉంటారు. అంతేకాదు,ఈ రాశికి చెందిన వ్యక్తులు అత్తమామల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువే. పరిహారాలు : మంగళవారం నాడు హనుమంతుని ఆలయంలో పప్పు ధాన్యాలు, బెల్లం నైవేద్యంగా పెట్టండి.

కర్కాటక రాశి : కర్కాటక రాశి కుజుడు 2వ సంచారం చేస్తున్నాడు. కావున, ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. కానీ,ఖర్చులు మాత్రం అధికమవుతాయి. తాత్కాలికంగా మంగళకరం చేస్తుంది. పరిహారం : ఆలయంలో కర్పూరం లేదా పెరుగు దానం చేయండి.

కన్యా రాశి : కన్యారాశి వారికి 12వ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. వీరికి విదేశీ సంబంధాలను పెంచుతుంది. లైంగిక ఆనందాలు పొందుతారు. మంగళ దోషం పట్ల జాగ్రత్తగా ఉండండి. పరిహారం: హనుమాన్ ఆలయంలో స్వీట్లు నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని పంచి పెట్టండి.

తులారాశి : రాశి జాతకులకు కుజుడు 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కావున, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాడు. తండ్రులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పరిహారాలు : అవసరమైన వారికి బట్టలు దానం చేస్తే మంచిది.

వృశ్చిక రాశి : ఇక రాశి వారికి కుజుడు పదవ ఇంట్లో ఉండటం వల్ల వీరికి జీవితంలో ఉత్తం లభిస్తుంది. తండ్రి పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి.

పరిహారాలు : పాలు మరిగేటప్పుడు పాత్ర నుంచి పాలు బయటకు పోనివ్వకండి, పిల్లలు లేని వారికి సహాయం చేయండి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి 9 వ ఇంట్లో కుజుడు ఉండటం చేత ఈ రాశి వారికి అదృష్టం బలపడుతుంది. సోదరుడి నుండి మద్దతు లభిస్తుంది. ఉన్నత పదవులను అందుకుంటారు. పరిహారం : సోదరులకు సహాయం.

మకర రాశి : ఈ రాశి వారికి, ఎనిమిదవ ఇంట్లో సంచారం కుజుడు అడ్డంకులను కలిగిస్తున్నాడు. ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. తాత్కాలికంగా, మంగలిక యోగం ఏర్పడుతుంది. పరిహారం : ఆలయంలో పప్పు ధాన్యాలను దానం చేయడం.

కుంభరాశి : కుంభ రాశి వారికి కుజుడు సంచారం 7వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. వైవాహిక జీవితంలో స్వల్ప ఆటంకాలను ఏర్పడవచ్చు. మంగళ దోషం తాత్కాలికంగా తొలగిపోతుంది. పరిహారం : అత్త లేదా సోదరికి ఎరుపు రంగు దుస్తులు బహుమతిగా ఇవ్వండి చిన్నారులకు స్వీట్లు పంచండి.

మీన రాశి : మీన రాశి వారికి 6 ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి, వీరికి శత్రువులపై విజయం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సమాజ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పరిహారం : మంగళవారం మీ సోదరుడికి బహుమతి ఇవ్వండి. స్నేహితులకు ఉప్పు ఉన్న వస్తువులను ఇవ్వడం శుభప్రదం.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి