Mouni Amavasya : ఫిబ్రవరి 9న మౌని అమావాస్యగా జరుపుకుంటూ ఉంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో వస్తుంది. అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. మరియు నదుల్లో పవిత్ర స్నానాలు కూడా ఆచరిస్తారు. మరో ముఖ్యమైన విషయం మౌని అమావాస్య సాధారణంగా కొత్త సమస్యకు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య అనేది ఈ యొక్క చిన్న పరిహారానికి ప్రత్యేకించబడిన రోజు కాబట్టి ఈరోజున మీరు కచ్చితంగా పరిహారం చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకున్నారు కదండీ. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో నీటిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని ఆ నీటితో తల స్నానం చేయండి.
చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు. ఇక ప్రతి తల్లి కూడా కొడుకులు ఉన్న తల్లి ఎవరైనా సరే అంటే ఒక కొడుకు కావచ్చు. ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్న తల్లి అయినా సరే అండి మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు వృద్దిను చూడాలి అనుకుంటే ఈ విధంగా ఈ ప్రత్యేకించబడిన రోజు వారిపై ఉన్నటువంటి ఈ దృష్టి దోషాలను మీరు తొలగించుకోవచ్చు. కాబట్టి చిన్న పరిహారం చేయవచ్చండి. ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి. అంటే ఎరుపు రంగు కానీ లేకపోతే పసుపుపచ్చ రంగు కానీ వస్త్రాన్ని తీసుకొని దాంట్లో కొంచెం గల్లు ఉప్పు వేయండి.. వేసిన తర్వాత ఒక నాలుగు ఐదు లవంగాలను కూడా వేయండి. ఎందుకంటే ఈ దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పదార్థాలు లవంగాలు, ఉప్పు. ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే లవంగాలకు కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే దానిపైన కొంచెం కుంకుమను కూడా వేయండి.
కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ మూడు పదార్థాలు దాంట్లో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టేసేయండి. ఈ మూట మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకొని మీ కొడుకును తూర్పుముఖంగా కూర్చోబెట్టి వారు ఎడమ చేయి వైపు నుండి వారి చుట్టూ తిప్పండి. మీరు నిరసన ప్రదేశంలో కావచ్చు. లేకపోతే ఎవరూ తిరగని ప్రదేశంలో కావచ్చు. ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కాని లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కాని అంటే ఎవరు తోక్కకుండా వేసి మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ విధంగా కనక మీరు చేశారంటే వారిపై ఉన్న దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.. ఇక ఇలా చేస్తే మీ కొడుకులు కచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు. కచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్నటువంటి మౌని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పక చేసి చూడండి .. మంచి ఫలితాలను చూస్తారు…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.